హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్..!!

హైదరాబాదు మెట్రో ప్రయాణికులకు( Hyderabad Metro Stations ) రైల్వే అధికారులు బిగ్ షాక్ ఇవ్వటం జరిగింది.

మేటర్ లోకి వెళ్తే మెట్రో స్టేషన్ లలో పబ్లిక్ టాయిలెట్ వాడాలంటే కచ్చితంగా యూజర్ చార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించారు.

జూన్ 2 నుంచి యూజర్ చార్జీలు అమ్ములు కాబోతున్నాయని స్పష్టం చేశారు.స్టేషన్ లో టాయిలెట్ వాడకానికి ఐదు రూపాయలు, యూరినల్ వాడకానికి రెండు రూపాయలు వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Big Shock For Hyderabad Metro Commuters, Hyderabad Metro, Toilet Charges,Public

దీంతో ఇప్పటికే మెట్రో ఛార్జీల పెంపుతో ఇబ్బందులు పడుతున్న లక్షలాదిమంది ప్రయాణికులు ఇప్పుడు ఈ టాయిలెట్ యూజర్ చార్జీలు( Toilet User Charges ) పెంపుదల నిర్ణయంతో మరింత భారం పడినట్లు అయింది.ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్ లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్( Public Toilets ) అందుబాటులో ఉన్నాయి.

వాటిని ఉపయోగించేందుకు ప్రయాణికుల వద్ద నుంచి ఎలాంటి చార్జి వసూలు చేయడం లేదు.కానీ తాజా నిర్ణయంతో వాటికి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Advertisement

అంతేకాదు రాబోయే రోజుల్లో అన్ని మెట్రో స్టేషన్( Metro Stations ) లలో పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ రకంగా ఆదాయం పెంచుకోవడంతో పాటు లాభదాయకంగా మార్చేందుకు ఎల్ అండ్ టీ వేగంగా అడుగులు వేస్తూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికులకు షాకుల మీద షాక్ లు ఇస్తూ ఉంది.

ప్రజలను కొట్టడానికి దూసుకెళ్లిన రోబొ.. వీడియో వైరల్
Advertisement

తాజా వార్తలు