Tesla Cars Elon Musk : టెస్లా కార్లలో పెద్ద ఇష్యూ.. 3 లక్షల పైగా కార్లు వెనక్కి..!

ఎలాన్‌ మస్క్‌కి చెందిన టెస్లా కార్లలో ఎన్నడూ లేనివిధంగా సమస్యలు బయట పడుతున్నాయి.కాగా తాజాగా 321,000 కంటే ఎక్కువ వాహనాలలో ఒక సమస్య బయటపడింది.

దాంతో టెస్లా కంపెనీ యునైటెడ్ స్టేట్స్‌లో 321,000 కంటే ఎక్కువ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.ఇంతకీ ఏంటా సమస్య అంటే.

కారు టెయిల్ లైట్లు అప్పుడప్పుడు వెలుతురులో ఫెయిలవుతున్నాయి.ఈ విషయాన్ని శనివారం పబ్లిక్ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.

ఈ సమస్య చిన్నదైనా చాలా కార్లలో ఉత్పన్నం కావడంతో ఇది పెద్ద ఇష్యులాగా మారింది.నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌తో దాఖలు చేసిన వివరాల ప్రకారం, రీకాల్‌లో 2023 మోడల్ 3, 2020-2023 మోడల్ Y వాహనాలు ఉన్నాయి.

Advertisement
Big Issue In Tesla Cars More Than 3 Lakh Cars Back , Tesla, Tesla Cars, Tesla C

టెస్లా కంపెనీ రియర్ లైట్ సమస్యను సరిచేయడానికి ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తోంది.రీకాల్‌కు సంబంధించి ఎలాంటి క్రాష్‌లు లేదా గాయాల కాలేదని సమాచారం.

Big Issue In Tesla Cars More Than 3 Lakh Cars Back , Tesla, Tesla Cars, Tesla C

అక్టోబర్ నెలాఖరిలో ఈ సమస్య ఉన్నట్టు కస్టమర్ల ఫిర్యాదులతో తెలుసుకున్నామని టెస్లా అధికారులు వెల్లడించారు.వాహనం స్టార్ట్ అయ్యే ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో లైట్లు అడపాదడపా పని చేయకపోవచ్చని కంపెనీ తెలిపింది.ఈ సమస్యపై మూడు వారంటీ నివేదికలు అందాయని టెస్లా తెలిపింది.

ఇదిలా ఉండగా, ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ తప్పుగా అమర్చడానికి కారణమైన సమస్యపై యునైటెడ్ స్టేట్స్‌లో సుమారు 30,000 మోడల్ X కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.ఈ ప్రకటన తర్వాత టెస్లా షేర్లను దాదాపు 3% పడిపోయాయి.

బీఎల్ఏ దాడి.. 'జాఫర్ ఎక్స్‌ప్రెస్' రైలు హైజాక్
Advertisement

తాజా వార్తలు