వైట్‌హౌస్‌లో ఆక్రమణదారుడు... ఖాళీ చేయాల్సిందే: ట్రంప్‌కు బిడెన్ వర్గం అల్టీమేటం

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి.డెమొక్రాటిక్ అభ్యర్ధి జో బిడెన్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ కోర్టు మెట్లెక్కడం .అక్కడ భంగపాటు ఎదురవ్వడం తెలిసిందే.ఇదే సమయంలో ఇరు పార్టీల మద్ధతుదారులు మాటల యుద్ధానికి దిగుతున్నారు.

తాజాగా బిడెన్ అధికార ప్రతినిధి ఆండ్రూ బేట్స్ మాట్లాడుతూ.ట్రంప్ ఇక వైట్ హౌస్‌ని ఖాళీ చేయాలని కోరారు.

తాము గతంలో చెప్పినట్లుగానే అమెరికా ప్రజలు విజేతను నిర్ణయించారని.దురాక్రమణదారులను అమెరికా ప్రభుత్వం ఇక శ్వేతసౌధం నుంచి ఖాళీ చేయించాలని వ్యాఖ్యానించారు.

Advertisement

మరోవైపు సోషల్‌ మీడియాలో ట్రంప్‌ మీద ట్రోలింగ్‌ ఓ రేంజ్‌లో నడుస్తుంది.ఎన్నికల గురించి ట్రంప్‌ తప్పుడు ప్రచారం చేస్తుండటంతో విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈ క్రమంలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరలవుతోంది.అధ్యక్ష భవనం బయట ఉన్న ఓ మూవింగ్‌ ట్రక్కు నెటిజనుల దృష్టిని ఆకర్షించింది.

దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.ముఖ్యమైన పత్రాలు, హర్డ్‌ డిస్క్‌లను తీసుకెళ్తున్నారని.

వెండి వస్తువులను తరలించడానికి ట్రంప్‌ ట్రక్కు మాట్లాడుకున్నారని కామెంట్‌ చేస్తున్నారు.ట్రక్కు మీద ఉన్న అక్షరాలు సరిగా కనబడటం లేదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

నెటిజనులు మాత్రం ఈ ట్రక్కును పెస్న్కే కంపెనీకి చెందినదిగా భావిస్తున్నారు.అటు ఫలితాలు తేలాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల్లో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Advertisement

తాము స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నామని జో బిడెన్‌ చెబుతున్నారు.ట్రంప్‌పై 40 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందుతామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొదట్లో ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్న జార్జియాలోనూ బిడెన్‌ ఆధిక్యంలోకి వచ్చారు.ప్రస్తుతం 4,020 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఇక్కడ 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి.20 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియా, 6 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న నెవాడాలోనూ బెడెన్‌ హవా కొనసాగుతోంది.ఇప్పటికే 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన బిడెన్‌ మేజిక్‌ ఫిగర్‌కు కేవలం 6 ఎలక్టోరల్‌ ఓట్ల దూరంలోనే ఉన్నారు.

దీంతో ఈ మూడు రాష్ట్రాల్లో ఏ ఒక్కటి గెలిచినా బిడెన్‌ విజయం తథ్యమైనట్లే.ఒక వేళ అలస్కా (3), అరిజోనా (11)లో ట్రంప్‌ విజయం సాధించినా మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువ కాలేరు.

దీంతో బిడెన్‌ ఎన్నిక లాంఛనమే.

తాజా వార్తలు