భారతీయుల గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్‌లు .. ఆ ‘‘తేదీ’’లను మార్చండి : బైడెన్ యంత్రాంగానికి చట్టసభ సభ్యుల విజ్ఞప్తి

అమెరికాలో ( America )శాశ్వత నివాస హోదా పొందేందుకు భారతీయులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

కంట్రీ క్యాప్ నిబంధన కారణంగా భారత్ , చైనా వంటి పెద్ద దేశాలకు చెందిన వలసదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇలా నిరీక్షిస్తూ పోతే 200 ఏళ్లు గడిచినా భారతీయులకు గ్రీన్ కార్డ్ రావడం కష్టమే.ఈ నేపథ్యంలో భారతీయులకు ఈ విషయంలో ప్రాధాన్యత దక్కేలా చర్యలు తీసుకోవాలని యూఎస్ చట్టసభ సభ్యుల బృందం బైడెన్( Biden ) అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేసింది.

భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి( Congress member Raja Krishnamurthy ), అమెరికన్ నేత లారీ బుక్సన్( Larry Buckson ) నేతృత్వంలో 56 మంది చట్టసభ సభ్యులతో కూడిన ద్వైపాక్షిక బృందం.అధిక నైపుణ్యం కలిగిన ఉపాధి ఆధారిత వీసా విషయంలో భారతీయులకు ఉపశమనం కలిగించేలా కార్యనిర్వాహక చర్యలు తీసుకోవాలని కోరింది.

విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో మయోర్కాస్‌లకు వీరు విడి విడిగా లేఖలు పంపారు.

Advertisement

బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ ప్రచురించిన ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ వీసా బులెటిన్‌లో ఉపాధి ఆధారిత వీసా దరఖాస్తులను దాఖలు చేయడానికి అన్ని తేదీలను "current"గా గుర్తించాలని తమ లేఖలో చట్టసభ సభ్యులు విజ్ఞప్తి చేశారు.ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్‌కార్డ్‌పై( Employment Based Green Card ) అమెరికా ప్రభుత్వం 7 శాతం నిబంధన (కంట్రీ క్యాప్) అమలు చేస్తోంది.ఇది భారత్ వంటి దేశాలకు తీవ్ర పరిణామాలను కలిగిస్తోంది.

తద్వారా భారతీయులు గ్రీన్‌కార్డ్ పొందాలంటే దాదాపు 195 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వుంటుందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్ యూఎస్ఏ) తెలిపింది.

గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్స్ భారతీయ సాంకేతిక నిపుణులను అసాధారణంగా ప్రభావితం చేస్తుందని ఫౌండేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.అత్యంత నైపుణ్యం కలిగిన STEM విభాగంలో వీరు వున్నారని.టెక్ ఇండస్ట్రీలో అమెరికా పోటీతత్వాన్ని కొనసాగించడంలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొంది.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు