వరదలు, వేడిగాలులతో అమెరికా విలవిల.. రాష్ట్రాలకు ఆర్ధిక సాయం చేసే యోచనలో బైడెన్ : కమలా హారిస్ హింట్

అకాల వర్షాలు, భారీ వరదలు, వేడి గాలులు, కార్చిచ్చుతో అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విలవిలలాడుతోంది.

ఈ ప్రకృతి విపత్తుల కారణంగా లక్షలాది మంది అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులయ్యారు.దేశంలో నెలకొన్న ఈ పరిస్ధితిపై ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందించారు.

ఈ వాతావరణ మార్పులను తక్షణ, అత్యవసర సంక్షోభంగా ఆమె అభివర్ణించారు.కెంటుకీలో భారీ వరదలతో పాటు తన స్వస్థలమైన కాలిఫోర్నియాలో కార్చిచ్చులపై బైడెన్ పరిపాలనా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించిందని కమలా హారిస్ తెలిపారు.

వాతావరణ మార్పుల కారణంగా చోటు చేసుకుంటున్న వరదలు, విపరీతమైన వేడిని పరిష్కరించడానికి రాష్ట్రాలకు అందుబాటులో వున్న 1 బిలియన్ డాలర్ల పైచిలుకు గ్రాంట్‌ను ప్రకటించడానికి హారిస్ సిద్ధంగా వున్నారు.సోమవారం నేషనల్ హరికేన్ సెంటర్‌ను సందర్శించిన ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ.ఈ విపరీత పరిస్ధితిని చక్కదిద్దడం అత్యవసరమన్నారు.2021లోనూ అమెరికా సంయుక్త రాష్ట్రాలు 20 వాతావరణ సంబంధిత విపత్తులను ఎదుర్కొన్నాయి.అప్పట్లో ఒక్కొక్కటి 1 బిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని కలిగించిందని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ నివేదికను ఉటంకిస్తూ హారిస్ తెలిపారు.1990లలో ఏడాదికి దాదాపు ఆరు విపత్తులు జరిగాయని ఆమె గుర్తుచేశారు.ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీని సందర్శించే ముందు బ్రీఫింగ్ కోసం హరికేన్ సెంటర్‌లో ఆగారు కమలా హారిస్.

Advertisement

అక్కడ ఆమె దేశవ్యాప్తంగా విపరీతమైన వాతావరణ పరిస్ధితుల నుంచి రక్షించడానికి గ్రాంట్లు ప్రకటించాలని భావిస్తున్నారు.ఎఫ్‌ఈఎంఏ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్, ఇతర ఏజెన్సీలు నిర్వహించే కార్యక్రమాల ద్వారా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి కమ్యూనిటీలకు సహాయం చేయడానికి తన యంత్రాంగం 2.3 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుందని జో బైడెన్ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.వాతావరణ సంబంధిత ప్రమాదాలను తగ్గించడానికి.

వరదలు, కార్చిచ్చు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుంచేందుకు బిల్డింగ్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమ్యూనిటీస్ (బీఆర్ఐసీ) ప్రోగ్రామ్‌పై చర్చలు జరుపుతున్నట్లు బైడెన్ తెలిపారు.

ఇకపోతే.బీఆర్ఐసీ కార్యక్రమం కింద మొత్తం 1 బిలియన్ డాలర్లు అందుబాటులోకి రానున్నాయని.మరో 160 మిలియన్ డాలర్ల వరద ఉపశమన సహాయం కోసం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్‌విల్లే గతేడాది బీఆర్ఐసీ కార్యక్రమం కింద డబ్బు అందుకున్న నగరాల్లో ఒకటి.వరదల నివారణ, మురికినీటి మౌలిక సదుపాయాల కోసం నగరానికి 23 మిలియన్లను అందించారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

జాక్సన్‌విల్లే ఫ్లోరిడాలోని అతిపెద్ద నగరం.సెయింట్ జాన్స్ నది, అట్లాంటిక్ మహా సముద్రం వెంబడి తేమతో కూడిన ఉష్ణ మండల ప్రాంతంలో వుంది.

Advertisement

మురికినీటి పరివాహక ప్రాంతాలు సామర్ధ్యానికి మించి ప్రవహించినప్పుడు.ఇక్కడ వరదలు పోటెత్తుతున్నాయి.

మయామి డేడ్ కౌంటీలోని సౌత్ ఫ్లోరిడా వాటర్ మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ట్.వరద తగ్గింపు, పంప్ స్టేషన్ మరమ్మత్తుల కోసం 50 మిలియన్ డాలర్లను అందుకుంది.

నగరంలో రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ది చెందుతుండటంతో ఇది హై రిస్క్ ఫ్లడ్ జోన్‌గా మారి ఇప్పటికే వున్న వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు