తమన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ ఫ్యాన్స్.. బయట కనపడవద్దు అంటూ..!

నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు తమ అభిమాన నటుడికి పెద్దఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సినిమాలలోని అప్డేట్స్ కోసం గత కొన్ని రోజుల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి సినిమాలో నుంచి విడుదల చేస్తూ అభిమానులను సందడి చేశారు.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నటిస్తున్నటువంటి "భీమ్లా నాయక్" నాయక్ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నప్పటికీ పవన్ అభిమానులు మాత్రం ఈ పాటపై సంతృప్తి చెందలేదని అర్థమవుతోంది.

కొంతమందిఈ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ ఎక్కువ శాతం మంది తమన్ సంగీతంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేస్తున్నాయని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ఈ పాటను విడుదల చేసిన కొద్దిసేపటికి మంచి వ్యూస్ దక్కించుకోవడమే కాకుండా కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పాటలను విడుదల చేసి సినిమాపై ఆసక్తిని తగ్గిస్తున్నారంటూ నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు.ఈ పాట వింటుంటే ఏమాత్రం ఆసక్తికరంగా లేదని పవన్ అభిమానులు పెదవి విరుస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు తమన్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలోని తమన్ ను ఉద్దేశిస్తూ పవన్ అభిమానులు ఈరోజు నువ్వు బయట కనపడితే ఊరుకునేదిలేదంటూ పవన్ ఫ్యాన్స్ చెబుతూ ఉన్న మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు