ఔను! మంత్రి కొడాలి నానికి ఇప్పుడు పెద్ద అగ్నిపరీక్షే ఎదురైంది.ఇదేదో పంచాయతీ ఎన్నికలో.
కార్పొరేష న్ ఎన్నికలో.లేక.
టీడీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడమో.కాదు!వీటన్నింటికీ మించి.
కొడాలికి ఇప్పుడు పెను సమస్య ఒకటి వచ్చి పడింది.అది కూడా పార్టీ అధినేత.
సీఎం జగన్ మానసపుత్రికగా భావిస్తున్న కీలక పథకం రూపంలో మంత్రిగారికి సెగ చూపిస్తోంది.ఈ పథకాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఆయన పైనే ఉంది.
అయితే.ఆదిలో ఈ పథకాన్ని లైట్ తీసుకుని.
ఈ మాత్రం పథకాన్ని అమలు చేయలేనా? ముందుండి నడిపించలేనా? అని అనుకున్నారు.అయితే.
ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది.దీంతో మంత్రి కొడాలికి.
చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
విషయంలోకి వెళ్తే.
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం.ఇంటింటికీ రేషన్ పంపిణీ.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి లబ్ధిదారునికి.రేషన్ దుకాణాలకు వచ్చే పరిస్థితిని తప్పించి.
ఇంటి ముందుటికే రేషన్ పంపిణీని అమలు చేయాలని సంకల్పించిన జగన్.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ క్రమంలో 9 వేల వాహనాలను వేల కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు.లబ్ధిదారులకు ఇంటింటికీ చేరవేసేందుకు ఉద్యోగులను కూడా నియమించుకున్నారు.
ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఈ పథకం ప్రారంభం కాకపోయినా.పట్టణాలు, నగరాల్లో మాత్రం ప్రారంభమైంది.

ఇక, ఈ పథకాన్ని.అమలు చేయడం, సక్సెస్ చేయడం, పర్యవేక్షించడం వంటి బాధ్యతలను మంత్రి కొడాలి నానికి అప్పగించారు జగన్.దీనికి రీజన్.పౌరసరఫరాల శాఖ మంత్రి ఆయనే కావడం.దీంతో ఇప్పటి వరకు తన సత్తాను నిరూపించుకునే ఛాన్స్ దక్కలేదని భావించిన కొడాలి.ఈ పథకాన్ని సక్సెస్ చేసి.
తనెంత పనిమంతుడినో .నిరూపించుకుని జగన్ దగ్గర మరిన్ని మార్కులు కొట్టేయాలని అనుకున్నారు.అయితే.ఆయన అనుకున్నది ఒకటి.క్షేత్రస్థాయిలో జరిగింది మరొకటి.వాహనాలను నడిపేందుకు పథకాన్ని నడిపించేందుకు ముందుకు వచ్చిన యువత ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.
రెండు రోజుల కింద ప్రారంభమైన ఈ పథకంలో డ్రైవర్లు.“మేం చేయలేం బాబోయ్!!“అంటూ.చేతులు ఎత్తేస్తున్నారు.ప్రస్తుతం 3 వేల వాహనాలను రంగంలోకి దింపగా.రాత్రికిరాత్రి 15 వందల వాహనాలను వారు అధికారులకు అప్పగించేశారు.మూటలు మోయలేమని.
ఇంటింటికీ తీసుకువెళ్లి కేజీలకు కేజీల బియ్యాన్ని మోసీ అందించలేమని.వారు చెబుతున్నారు.
ఈ మూటలు మోసుకునే బదులు.పల్లీలు అమ్ముకున్నా.
హ్యాపీగా ఉంటుందని కూడా బహిరంగ వ్యాఖ్యలే చేస్తున్నారు.దీంతో ఆదిలోనే ఈ పథకం బెడిసికొట్టింది.
మరి ఇప్పుడు ఈ పథకం నడిపిస్తారని.తనకు పేరు తెస్తారని.
జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడాలినాని ఏం చేస్తారో చూడాలి.ఇది కనుక విఫలమైతే.
ఇప్పటి వరకు జగన్ దగ్గర ఉన్న మార్కులు మొత్తం మైనస్ కావడం ఖాయమని అంటున్నారుపరిశీలకులు.