దొంగలున్నారు జాగ్రత్త! మీకు IRCTCనుండి రీఫండ్ రాకపోతే ఇలా చేయకండి!

ఈమధ్య కాలంలో ఎపుడైనా రైలు టికెట్లు బుక్ చేసి ఆ తర్వాత క్యాన్సిల్ చేసి, రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీలాంటివారికే ఈ న్యూస్.

తాజాగా రైలు టికెట్ల రీఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు.

రీఫండ్ రావాల్సిన ప్రయాణికులకు లింక్స్ పంపుతూ, కాల్స్ చేస్తూ నానా రభస సృష్టిస్తున్నారు. UPI ద్వారా డబ్బులు పంపిస్తామని నమ్మించి నిలువునా ముంచేస్తున్నారు.

ఇలాంటికేసులు ఈమధ్యకాలంలో అనేకం పోలీసులు దృష్టికి వెళ్లడంతో వారు అప్రమత్తం చేస్తున్నారు.దాంతో తాజాగా ఈ విషయం భారతీయ రైల్వే దృష్టికి కూడా వచ్చింది.

ఈ క్రమంలో ఇండియన్ రైల్వే ప్రయాణికులను హెచ్చరిస్తోంది.మీ స్మార్ట్ ఫోన్లకు ఎలాంటి అనుమానాస్పద లింక్స్‌కు, కాల్స్‌కు వచ్చినా ఎట్టి పరిస్థితులలో రెస్పాండ్ కావొద్దని, అది ఆర్థికపరమైన మోసాలకు దారితీయొచ్చని తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది.

Advertisement

సైబర్ నేరగాళ్లు లింక్స్ పంపించి లింక్స్ క్లిక్ చేస్తే రీఫండ్ వస్తుందని, ఫోన్ కాల్‌లో తాము అడిగిన వివరాలు చెబితే రీఫండ్ పొందొచ్చని నమ్మిస్తున్నారు.దాంతో కొందరు మోసపోతున్నారు.

కానీ అలాంటివి నమ్మవద్దు. IRCTC రీఫండ్ ప్రాసెస్ అనేది పూర్తిగా ఆటోమెటిక్‌గానే జరుగుతుంది.ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు.

కాబట్టి ఇలాంటి లింక్స్ లేదా కాల్స్‌కు అస్సలు స్పందించకూడదు అని మనం గుర్తు పెట్టుకోవాలి.ఇటీవలికాలంలో వరుస ఫిర్యాదులు రావడంతో ప్రయాణికుల్ని అప్రమత్తం చేస్తోంది రైల్వే.

రైల్వే సేవా మాత్రమే కాదు, ఐఆర్‌సీటీసీ కూడా ప్రయాణికుల్ని కూడా ఈ సందర్భంగా అప్రమత్తం చేస్తున్నారు.మీకు ఎవరైనా కాల్ చేసి క్రెడిట్ కార్డ్ నెంబర్లు, డెబిట్ కార్డ్, ఓటీపీ, ఏటీఎం పిన్, పాన్ నెంబర్, సీవీవీ, పుట్టిన తేదీ లాంటి వివరాలు అడిగితే అస్సలు స్పందించకూడదని చెబుతున్నారు.

ఇయర్‌రింగ్స్ తొడుక్కున్న ఫారిన్ వ్యక్తి.. తొలగించమన్న అవ్వ..?
Advertisement
" autoplay>

తాజా వార్తలు