ఇస్మార్ట్ శంకర్ కంటే డబుల్ ఇస్మార్ట్ కు బెటర్ రివ్యూలు.. రామ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడా?

రామ్ , పూరీ జగన్నాథ్( Ram, Puri Jagannath ) కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ( ISmart Shankar Movie ) విడుదలైన సమయంలో ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.

చాలామంది ప్రేక్షకులు ఈ సినిమా తమకు నచ్చిందని చెప్పినా క్రిటిక్స్ మాత్రం ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు.

అయితే అప్పట్లో ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్ల విషయంలో బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే సంగతి తెలిసిందే.ఈరోజు థియేటర్లలో డబుల్ ఇస్మార్ట్ మూవీ విడుదలైంది.

అందరూ ఊహించన విధంగానే ఈ సినిమాకు సైతం నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.అయితే ఇస్మార్ట్ శంకర్ కంటే డబుల్ ఇస్మార్ట్ కు బెటర్ రివ్యూలు వచ్చాయి.

తాజాగా విడుదలైన తెలుగు సినిమాలలో ఇతర సినిమాలతో పోల్చి చూస్తే డబుల్ ఇస్మార్ట్ బెటర్ మూవీ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.ఇస్మార్ట్ శంకర్ తో పోల్చి చూస్తే డబుల్ ఇస్మార్ట్ మూవీ బడ్జెట్ కూడా ఎక్కువ అనే సంగతి తెలిసిందే.

Advertisement

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కావ్య థాపర్( Kavya Thapar ) హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్ ( Sanjay Dutt )ఈ సినిమాలో విలన్ గా నటించడం గమనార్హం.సంజయ్ దత్ విలనిజం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా రామ్ సంజయ్ దత్ కాంబో సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.డబుల్ ఇస్మార్ట్ కమర్షియల్ రేంజ్ తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

డబుల్ ఇస్మార్ట్ సినిమాకు రామ్ పోతినెని పర్ఫామెన్స్ మాత్రం హైలెట్ గా నిలిచింది.డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరకాల్సి ఉంది.పూరీ జగన్నాథ్ కు నిర్మాతగా డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్ లో లాభాలను అందిస్తుందో చూడాలి.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు