చ‌లికాలంలో చ‌ర్మాన్ని ర‌క్షించే న్యాచుర‌ల్ స్క్ర‌బ్‌లు ఇవే!

చ‌లి కాలంలో చ‌ర్మాన్ని ర‌క్షించుకోవ‌డం అంటే పెద్ద స‌వాల్‌తో కూడుకున్న ప‌నే.ఎందుకంటే, ఎంత ఖ‌రీదైన‌ క్రీములు, మాయిశ్చ‌రైజ‌ర్లు, లోష‌న్లు, సీర‌మ్‌లు వాడినా.

ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.ముఖ్యంగా చ‌ర్మం పొడి బార‌డం, నిర్జీవంగా మార‌డం, తెల్ల మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌టం ఇలా వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు తీవ్ర వేద‌న‌కు గురి చేస్తాయి.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ అండ్ సూప‌ర్ స్క్ర‌బ్‌ను వాడితే గ‌నుక చ‌లి కాలంలో ఇబ్బంది పెట్టే చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.మ‌రి ఆ స్క్ర‌బ్‌లు ఏంటో.? ఎలా త‌యారు చేసుకోవాలో.? ఓ చూపు చూసేయండి.స్క్ర‌బ్-1: ముందుగా కొన్ని కీర‌దోస ముక్క‌ల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌లో రెండు స్పూన్లు కీర‌దోస పేస్ట్, నాలుగు లేదా ఐదు చుక్క‌లు జొజోబా ఆయిల్, ఒక స్పూన్ రోజ్ వాట‌ర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు ప‌ట్టించి కాసేపు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో మూడు సార్లు చేస్తే చ‌ర్మంపై ఉన్న మురికి, మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి.

Advertisement

దాంతో నిర్జీవంగా మారిన‌ చ‌ర్మం కాంతివంతంగా, కోమ‌లంగా మారుతుంది.

స్క్ర‌బ్‌-2: ఒక అవ‌కాడోను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు చిన్న గిన్నెలో ఒక స్పూన్ అవ‌కాడో పేస్ట్‌, అర స్పూన్ తుల‌సి ఆకుల పొడి, రెండు స్పూన్ల పెరుగు, అర స్పూన్ తేనె  వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు ప‌ట్టించి.

ప‌ది నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.అనంత‌రం స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

చ‌లి కాలంలో ఈ స్క్ర‌బ్‌ను వాడ‌టం వ‌ల్ల చ‌ర్మం తేమ‌గా, మృదువుగా మారుతుంది.మ‌రియు ఏమైనా మ‌చ్చ‌లు ఉన్నా తొల‌గిపోతాయి.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement
" autoplay>

తాజా వార్తలు