తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ఉద్యోగాల ప్రకటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగిన విషయం తెలిసిందే.అయితే ఉద్యోగాల ప్రకటన తరువాత ఇక ప్రతిపక్షాలు తమదైన శైలిలో ప్రకటనను విమర్శించిన విషయం తెలిసిందే.
అయితే కేసీఆర్ చేసిన ఈ సంచలన ప్రకటన వ్యూహంపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది.అయితే తెలంగాణపై ప్రశాంత్ కిషోర్ తనదైన శైలిలో రాజకీయ పరిస్థితులను గమనిస్తూ ఎప్పటికప్పుడు కేసీఆర్ కు సలహాలు సూచనలు అవసరమైన సమయంలో నివేదికలు కూడా అందిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ ప్రకటన వ్యూహం వెనుక ప్రశాంత్ కిషోర్ హస్తం ఉందని కొందరు అభిప్రాయ పడుతుండగా కొందరు ముందస్తు ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్ అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రకటన చేసి ఉండవచ్చుననే మరొక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున నడుస్తోంది.అయితే ఎవరి వ్యూహం అనేది ప్రస్తుతం అప్రస్తుత అంశం అయినప్పటికీ కెసీఆర్ ప్రకటన మాత్రం నిరుద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం కొంత ఊరట కలిగించే అంశం.

అయితే ప్రస్తుతం ఉద్యోగాల ప్రకటనపై భవిష్యత్తు లో ఎలాంటి వ్యూహాలు అవలంబించనున్నారనే ఒక ఆసక్తి నెలకొంది.ఉద్యోగాల భర్తీ పూర్తయ్యాక ఇక కెసీఆర్ తన విశ్వరూపం చూపించే అవకాశాలు ఉన్నాయి.ఎందుకంటే ఇక తెలంగాణలో కెసీఆర్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరగడానికి కారణమైన ప్రముఖ అంశం ఉద్యోగ నోటిఫికేషన్ లు.ఇక ఈ హామీని పూర్తిగా నెరవేర్చడంతో ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అనుకూల వాతావరణం అనేది పెరిగేందుకు ఎక్కువగా అవకాశం ఉంది.ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న రకరకాల చర్చలనేవి నిరుద్యోగులలో టీఆర్ఎస్ పట్ల పెరిగిన అభిమానాన్ని దెబ్బ తీయలేవనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా అనిపిస్తోంది.







