వేసవిలో హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్లేసులు చాలా బెస్ట్..

ఇండియాలో ఎండలు మండుతున్నాయి.జూన్ నెల వచ్చినా వర్షాలు అన్ని ప్రాంతాలలో కురవడం లేదు.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వడగాలులు వీస్తూ ఊపిరాడనివ్వడం లేదు.ఇలాంటి సమయంలో కొద్దిరోజులు చల్లటి ప్రదేశానికి వెళ్లి ఆనందంగా గడపాలని అందరికీ ఉంటుంది.

అయితే వేసవిలో విహారయాత్రలు( Summer Trips ) ప్లాన్ చేయడానికి కొన్ని ప్లేసులు ఉత్తమంగా నిలుస్తున్నాయి.ఈ ప్రదేశాలకు వెళ్లడం ద్వారా కుటుంబ సభ్యులతో వేసవి సెలవుల్లో ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.

ఇవి కొత్త ప్రదేశాలు కాబట్టి జనాల తాకిడి కూడా తక్కువగానే ఉంటుంది.మరి ఆ ప్లేస్‌లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

హిమాలయాలలో( Himalayas ) ఈ వేసవికాలంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.ఇక్కడ ప్రకృతి సౌందర్యాలు, సరస్సులు మనల్ని కట్టిపడేస్తాయి.

ఎత్తయిన కొండలు ట్రేక్కింగ్ ( Trekking ) చేయడానికి కూడా అనువుగా ఉంటాయి.కుటుంబ సమేతంగా వెళ్లి ఈ చల్లని ప్రదేశంలో ట్రేక్కింగ్ చేస్తే వచ్చే అనుభూతే వేరు.

కాకపోతే ఇక్కడ ఫుడ్ దొరకడం కాస్త కష్టం కాబట్టి ట్రిప్పు ప్లాన్ చేసుకునేవారు ఫుడ్ తమతో పాటే తీసుకెళ్లడం మంచిది.

ఇక వేసవి సెలవులు గడపడానికి మరొక ఉత్తమమైన ప్రదేశం ఔలి.ఇక్కడ కూడా కొండలు ఆకాశాన్ని తాకుతూ కనిపిస్తాయి.వీటిని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఇక వీటిని ట్రాకింగ్ చేస్తే వచ్చే ఎక్స్‌పీరియన్స్ కలకాలం అలానే గుర్తుండిపోతుంది.కాబట్టి వేసవి సెలవలకు ట్రిప్ కి వెళ్లాలనుకునేవారు ఈ ప్రదేశాన్ని ఒకసారి పరిశీలించవచ్చు.

Advertisement

సిక్కిం ( Sikkim ) పరిసర ప్రాంతాలకు కూడా సమ్మర్ ఎంజాయ్ చేయడానికి బాగుంటాయి.ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రకృతి సోయగాలు మనసులను దోచేస్తాయి.జనాల తాకిడి కూడా సిక్కిం పరిసరల ప్రాంతాల్లో పెద్దగా ఉండదు.

కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో సేద తీరడం కుదురుతుంది.ఇవన్నీ కాదనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి డార్జిలింగ్‌కి వెళ్ళవచ్చు.

ఇండో-చైనా సరిహద్దు డార్జిలింగ్ ప్రదేశంలోనే ఉంటుంది కాబట్టి అక్కడ బాగా ఎంజాయ్ చేయవచ్చు.యుమ్‌తాంగ్ లోయ కూడా సందర్శించవచ్చు.

తాజా వార్తలు