డ్రై హెయిర్ తో డోంట్ వర్రీ.. ఒక్క వాష్ తో రిపేర్ చేసుకోండిలా!

డ్రై హెయిర్( Dry hair ).ప్రస్తుత వర్షాకాలంలో చాలా మంది ఎదుర్కొనే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.

ముఖ్యంగా వర్షంలో తడిసినప్పుడు జుట్టు విపరీతంగా పొడి బారిపోయి జీవం కోల్పోయినట్లు తయారవుతుంది.అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంటారు.

అయితే డ్రై హెయిర్ తో వర్రీ అవ్వాల్సిన పనిలేదు.పొడి జుట్టును రిపేర్ చేయడానికి ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని కనుక ఫాలో అయ్యారంటే కేవలం ఒక్క వాష్ లోనే డ్రై హెయిర్ ను రిపేర్ చేసుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గుడ్లు పచ్చ సొన వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, వన్ టీ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) వేసుకొని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల డ్రై హెయిర్ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డొచ్చు.గుడ్డు పచ్చ సొనలో ఫ్యాట్స్ మెండుగా ఉంటాయి.అవి జుట్టును తేమగా మార్చడానికి సహాయపడతాయి.

పొడి, దెబ్బ తిన్న జుట్టును రిపేర్ చేయడం కోసం గుడ్డు పచ్చ సొన ఉపయోగించమని సిఫార్సు చేయబడింది.అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ క్యూటికల్‌ను మూసివేయడానికి, కురుల మెరుపును పెంచడానికి మరియు ఫ్రిజ్‌ని తగ్గించడానికి తోడ్పడుతుంది.

వర్షాకాలంలో ఈ న్యాచురల్ సీరంను వాడితే హెయిర్ ఫాల్ తో ఇక నో టెన్షన్!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్యారెట్ ను తింటే ప్రమాదమా..

ఇక ఆలివ్ ఆయిల్( Olive oil ) తంతువులను లోతుగా మాయిశ్చరైజింగ్ చేయడం మరియు బలోపేతం చేయడం ద్వారా జుట్టు విరిగిపోకుండా చేస్తుంది.ఆలివ్‌ ఆయిల్ లో ఉండే కొవ్వు ఆమ్లాలు పొడి జుట్టును తేమ‌గా మారుస్తాయి.

Advertisement

హెయిర్ ఫాల్ ను నివారిస్తాయి.ఆరోగ్యకరమైన, బలమైన జుట్టుకు ఆలివ్ ఆయిల్ మ‌ద్ద‌తు ఇస్తుంది.

తాజా వార్తలు