లో-బీపీ తో బాధపడేవారు తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో తెలుసా?

బీపీ.( Blood Pressure ) బ్లడ్ ప్రెజర్.రక్తపోటు.

ఇలా పేర్లు ఎన్నో ఉన్నాయి.అయితే బీపీ ఎక్కువైనా ముప్పే.

అలాగే తక్కువైన సరే ముప్పే.అయితే లో-బీపీ తో బాధపడేవారు మనలో చాలా మంది ఉంటారు.

ఈ సమస్య నుంచి బయటపడటం కోసం మందులు వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు ఉండాల్సిందే.ఈ ఆహారాలు రక్తపోటును అదుపులోకి తెచ్చేందుకు అద్భుతంగా సహాయపడతాయి.

Advertisement

మరి ఇంకెందుకు లేటు ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

చేపలు.( Fish ) చాలా మందికి మోస్ట్ ఫేవరేట్ నాన్ వెజ్.అయితే చేపలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా లో-బీపీ నుంచి బయటపడడానికి అద్భుతంగా సహాయపడతాయి.లో-బీపీ ఉన్న‌వారు వారానికి రెండు సార్లు చేపలు తీసుకుంటే మంచిది.

రక్తపోటును అదుపులోకి తేవడానికి సహాయపడే ఆహారాల్లో అవిసె గింజలు ఒకటి.వీటిని రోజుకు వన్ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే బీపీ కంట్రోల్ లోకి వస్తుంది.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

లో-బీపీ తో ఇబ్బంది పడుతున్న వారు రోజుకు ఒక దానిమ్మ పండును( Pomegranate ) కచ్చితంగా తీసుకోండి .ఎందుకంటే దానిమ్మలో ఉండే పలు పోషకాలు లో-బీపీ సమస్యను సమర్థవంతంగా దూరం చేస్తాయి.అలాగే లో-బీపీ( Low BP ) తో సతమతం అవుతున్న వారు రోజుకు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి తింటే చాలా మంచిది.

Advertisement

బీపీని అదుపులోకి తేవడానికి వెల్లుల్లి బాగా హెల్ప్ చేస్తుంది.

మందారం టీ( Hibiscus Tea ) వినే ఉంటారు కానీ దీన్ని ఎవ్వ‌రూ పెద్ద‌గా పట్టించుకోరు.కానీ లో-బీపీ ఉన్నవారు రోజుకు ఒక కప్పు మందారం టీ తాగితే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక ఇవే కాకుండా ఓట్స్, పిస్తా, ఆకుకూరలు, చిలగడదుంప, అవకాడో, బీట్ రూట్, అరటిపండు, పప్పు ధాన్యాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి ఆహారాలను కూడా డైట్ లో ఉండేలా చూసుకోవాలి.

ఈ ఫుడ్స్ లో-బీపీ సమస్య నుంచి బయటపడడానికి ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.మరియు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

తాజా వార్తలు