వైరల్: గుర్రానికి బలవంతంగా గంజాయి తాగిస్తున్న కసాయి.. నెటిజన్లు మండిపాటు!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్‌లోని( Uttarakhand ) కేదార్‌నాథ్‌లో అత్యంత దారుణమైన ఘటన ఒకటి చోటుచేసుకోగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 People Are Making A Horse Smoke Weed Forcefully At The Trek Of Kedarnath Temple-TeluguStop.com

అవును, కేదార్‌నాథ్ యాత్రకు( Kedarnath Yatra ) వెళుతున్న గుర్రానికి ( Horse ) బలవంతంగా గంజాయి ఇచ్చిన ఘటన ఇపుడు పెను సంచలనంగా మారింది.గుర్రపు నిర్వాహకులు గుర్రం నోటిలో బలవంతంగా గంజాయిని వేసి, ముక్కు, నోటి గుండా పొగ పట్టించడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

ఇలాంటి జంతు హింసకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కేదార్‌నాథ్ యాత్రలో భాగంగా యాత్రికులు ఎక్కువగా గుర్రాలను వినియోగిస్తారనే విషయం మీరు వినే వుంటారు.గుర్రపు స్వారీ చేసేవారు, శక్తి లేని వారు కొండపైకి వెళ్లేందుకు గుర్రపు సవారిని ఎంచుకుంటారు.దీంతో గుర్రపు స్వారీ, గుర్రపు నిర్వాహకులు కూడా అధిక ఆదాయాన్ని ఇక్కడ ఆర్జిస్తారు.

అయితే, సోషల్ మీడియాలో ఈ వీడియో విడుదలైన తర్వాత జంతు హింస, యాత్రికుల భద్రతపై ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు గుర్రపు నిర్వాహకులు గుర్రం నోటిలో గంజాయి పెట్టారు.

ఆ తరువాత వారిలో ఇద్దరు గుర్రం నోరు, ముక్కును గట్టిగా మూసారు.

అలా వారు చేస్తున్న వికృత చర్యకు పాపం ఆ గుర్రం చాలా భయాందోళనలకు గురి అయింది.అలా వారు ఆ గుర్రానికి గంజాయి పట్టారు.ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు చేయడం జరిగింది.

కాగా దీనిపై పలు జంతు సంరక్షణ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు నెటిజన్లు.

ఈ వీడియో సంచలనం సృష్టించడంతో కేదార్‌నాథ్ పోలీసులు స్పందించారు.వీడియోపై విచారణ జరుపుతామని, వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని ప్రకటించారు.

ఈ ఘటనపై సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.కేదార్‌నాథ్‌లో జంతువులను హింసించడం ఇది మొదటిసారి కాదు.

ఇక్కడ ప్రయాణికుల రవాణా కోసం సరైన ఆరోగ్యం, కండపుష్టి లేని గుర్రాలను వాడుకుంటూ వుంటారు.వాటికి సరైన ఆహారం కూడా వారు అందించరు.

దీంతో యాత్రికులను తీసుకెళ్తుండగా అవి పలుమార్లు కిందపడిపోవటం, పలువురు యాత్రికులు గాయపడిన సంఘటనలు కూడా అనేకం జరుగుతుంటాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube