మామిడి పండ్ల‌తో ఇలా చేస్తే.. ఆ జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ దూరం!

ప్ర‌స్తుత వేస‌వి కాలంలో విరి విరిగా ల‌భించే పండ్ల‌లో మామిడి ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ మామిడి పండ్ల‌ను ఇష్టంగా తింటుంటారు.

ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా మామిడి పండ్లు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.అలాగే జుట్టు సంర‌క్ష‌ణ‌కు సైతం ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అవును, మామిడి పండ్ల‌తో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా చేస్తే వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం కేశాల‌కు మామిడి పండ్ల‌ను ఎలా యూజ్ చేయాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా బాగా పండిన ఒక మామిడి పండును తీసుకుని.లోప‌ల ఉన్న గుజ్జును మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఒక బౌల్‌లో ఫుల్ ఎగ్‌ను వేసుకుని క‌ల‌పాలి.ఆ త‌ర్వాత ఇందులో మామిడి పండు గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల పుల్ల‌టి పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనె వేసి అన్ని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.న‌ల‌బై నిమిషాల అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

ఇలా వారంలో ఒక‌సారి చేస్తే గ‌నుక హెయిర్ ఫాల్‌, స్ప్లిట్ హెయిర్‌, హెయిర్ బ్రేకేజ్ వంటివి దూరం అవుతాయి.అదే స‌మ‌యంలో జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా కూడా పెరుగుతుంది.

అలాగే వేస‌వి కాలంలో ఎండ‌ల కార‌ణంగా చాలా మంది డ్రై హెయిర్‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.అయితే ఈ స‌మ‌స్య‌ను నివారించ‌డానికి మామిడి పండు సూప‌ర్‌గా హెల్ప్ చేస్తాయి.అందుకు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక క‌ప్పు మామిడి పండు ముక్క‌లు, ఒక అర‌టి పండు, పావు క‌ప్పు పాలు వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని కేశాల‌కు ప‌ట్టించి అరగంట పాటు వ‌దిలేయాలి.ఆపై హెడ్ బాత్ చేయాలి.ఇలా చేస్తే పొడిబారిన జుట్టు స్మూత్‌గా, సిల్కీగా మ‌రియు షైనీగా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు