యమరాజు ఎందుకు విదురుడు అవతారం ఎత్తవలసి వ‌చ్చిందో తెలుసా?

మ‌హ‌ర్షి మైత్రేయుడు విదురుడితో ఇలా అన్నాడు.“మాండవ్య మహర్షి శాపం కారణంగానే నువ్వు యమరాజు కార‌ణంగా దాసి కొడుకుగా అయ్యావు.కథ ఇలా సాగుతుంది… ఒకసారి కొంతమంది దొంగలు ఖజానా నుండి న‌గ‌దు, న‌గ‌లు దొంగిలించారు.చోరీ వార్త అంత‌టా వ్యాపించింది.సైన్యం దొంగల కోసం పరుగులు తీసింది.దొంగల‌ను వెంబడించారు.

 Why Did Yamaraju Have To Lift The Incarnation Of Vidura, Yamaraju, Vidura, Manda-TeluguStop.com

దీంతో దొంగలు మాండవ్య ఋషి ఆశ్రమంలో చోరీ సొత్తు ఉంచి పారిపోయారు.సైనికులు మాండవ్య ఋషి ఆశ్రమానికి వచ్చారు.

చోరీకి గురైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.మాండవ్య మహర్షి ధ్యానంలో ఉన్నాడు.

మాండవ్య మహర్షి వధ స్థలానికి తీసుకువ‌చ్చారు.అక్కడ అత‌ను గాయత్రీ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు.

మాండవ్య ఋషికి ఉరి తీయ‌డం వారికి సాధ్యంకాలేదు.రాజు కూడా ఆశ్చర్యపోయాడు.

పశ్చాత్తాపపడ్డాడు.మహర్షిని క్షమాపణ కోరాడు.

ఋషి ఇలా అన్నాడు,, రాజా.నేను నిన్ను క్షమించాను.

కానీ నాకు మరణశిక్ష ఎందుకు విధించారు? అని అడిగారు త‌రువాత‌ మాండవ్యుడు తన తపస్సుతో యమరాజును ప్ర‌త్య‌క్షం చేసుకుని.యమరాజా! నేను ఏ పాపం చేయనప్పుడు నాకు మరణశిక్ష ఎందుకు విధించారు? అని మహర్షి అడగడం తో యమరాజు వణికిపోయాడు.

ఋషివ‌ర్యా మీరు మూడేళ్ళ వయసులో సీతాకోక చిలుకను ముల్లుతో పొడిచావు… ఆ పాపం వల్లే నీకు ఈ శిక్ష పడింది” అన్నాడు.తెలిసీ తెలియక ఏ పాపం చేసినా శిక్ష అనుభవించాల్సిందే.

దేవుడికి పుణ్యం అర్పించవచ్చు కానీ పాపం కాదు.అని అన్నాడు.

మాండవ్య మహర్షి ఇలా అన్నాడు.అజ్ఞానంతో చేసిన పాపానికి నాకు మరణశిక్ష విధించారు.

ఈ అజ్ఞానం కారణంగా, నువ్వు బానిస కొడుకుగా పుట్టి, మానవ యోనిలోకి వెళ్లాలని నేను నిన్ను శపిస్తున్నాను.అని అన్నాడు… మైత్రేయ మహర్షి ఇప్పుడు ఇలా అన్నాడు.

విదురా ఈ కార‌ణంగానే నువ్వు మానవ యోనిలో దాసి కొడుకుగా పుట్టవలసి వచ్చింది.నువ్వు మామూలు మనిషివి కాదు, యమరాజు అవతారం, ఎవరైనా వేలు నరికితే అతని వేలు కూడా ఒకరోజు తెగిపోతుంది, ఎవరైనా ఎవరినైనా చంపితే, అతను కూడా ఏదోఒక రోజు హ‌త‌మ‌వుతాడ‌ని అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube