ఈ పండ్లను తొక్కతో సహా తింటే... డబుల్ ప్రయోజనాలు

అన్ని రకాల పండ్లలోనూ విటమిన్స్, మినిరల్స్ ,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.అందువల్ల పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

అయితే మనం తిని పడేసే తొక్కలలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే పండ్ల తొక్కలను పడేయకుండా తింటారు.

ఇప్పుడు ఏ పండు తొక్క తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఆరెంజ్ తొక్క

ఆరెంజ్ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఆరెంజ్ తొక్కలో కూడా ఉంటాయి.

ఇవి శరీరంలో అనవసర కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది.అంతే కాక మలబద్దకం, శ్వాస సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Advertisement

దానిమ్మ తొక్క

దానిమ్మ తొక్కలో న్యూట్రీషియన్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన అనేక రకాల వ్యాధులను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది.ఎముకలను బలంగా ఉంచటమే కాకుండా గొంతు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

పుచ్చకాయ తొక్క

సాధారణంగా పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.ఇది కొత్త కణాలను ప్రోత్సహించటం వలన జుట్టు, చర్మానికి బాగా సహాయపడుతుంది.బరువు తగ్గాలని అనుకొనే వారు పుచ్చకాయ తొక్కను తింటే చాల మార్పు కనపడుతుంది.

ఆపిల్

ఆపిల్ తొక్కలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మలబద్దకం సమస్యను తరిమి కొడుతోంది.అంతేకాక వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో కూడా బాగా సహాయపడుతుంది.

నిమ్మతొక్క

నిమ్మతొక్కలో విటమిన్ సి, యాంటీ సెప్టిక్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన ఓరల్ ఇన్ఫెక్షన్స్, స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో బాగా సహాయాపడుతుంది.

అంతేకాక ఒత్తిడిని తగ్గించటంలో కూడా బాగా సహాయపడుతుంది.

ఉగాది ప‌చ్చ‌డితో అంతులేని ఆరోగ్య లాభాలు.. మిస్ అయ్యారో చాలా న‌ష్ట‌పోతారు!
Advertisement

తాజా వార్తలు