అదే తప్పు మళ్లీమళ్లీ చేస్తున్న బెల్లంకొండ..?

అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు బెల్లంకొండ శ్రీనివాస్.

ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా సమంత నటించగా వివి వినాయక్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా భారీ బడ్జెట్ సినిమా కావడంతో కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది.అల్లుడు శ్రీను తరువాత శ్రీనివాస్ స్పీడున్నోడు, జయజానకినాయక, సాక్ష్యం, కవచం, సీత సినిమాల్లో హీరోగా నటించారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయజానకినాయక సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకోగా మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి.అయితే 2019లో విడుదలైన రాక్షసుడు సినిమా మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు కమర్షియల్ సక్సెస్ ను అందించింది.

తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి.

Advertisement

తమిళంలో రాట్చసన్ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ప్రేక్షకులు మెచ్చేలా ఉండటంతో రాక్షసుడు సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది.ఆ సినిమా హిట్ తరువాత శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటించగా ఈ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయింది.బెల్లంకొండ శ్రీనివాస్ కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తే మాత్రమే సక్సెస్ లు సొంతమవుతాయమని మంచి కథలు ఎంపిక చేసుకున్న ప్రతిసారి సక్సెస్ దక్కిందని కొన్నిసార్లు రొటీన్ కథలను ఎంచుకుంటూ శ్రీనివాస్ తప్పు చేస్తున్నారని సినీ అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రొటీన్ కథలకు భిన్నంగా నవ్యత ఉన్న కథలను ఎంచుకుంటే మాత్రమే బెల్లంకొండ శ్రీనివాస్ కు నటుడిగా మంచి పేరు రావడంతో పాటు కమర్షియల్ సక్సెస్ లు సొంతమవుతాయని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.శ్రీనువైట్లఫార్ములాతో తెరకెక్కుతున్న సినిమాలు ఈ మధ్య కాలంలో సక్సెస్ కావడం లేదు.

బెల్లంకొండ శ్రీనివాస్ కథల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.తొలిరోజు అల్లుడు అదుర్స్ సినిమాకు కోటీ 30 లక్షల రూపాయలు కలెక్షన్ల రూపంలో వచ్చినట్టు తెలుస్తోంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు