జాగ్రత్త సుమా.. కొత్తగా వాట్సాప్ ఓటీపీ స్కాం అంటా..!

వాట్సాప్.మన దైనందిక జీవితంలో ఈ యాప్ ఎంతగానో ప్రాముఖ్యత చెందింది.

ఫేస్బుక్ సంస్థ ఈ వాట్సప్ ను వ్యక్తిగతం చేసుకున్న తర్వాత అనేక అప్డేట్లను ఇస్తూ ప్రజలకు అనేక సదుపాయాలు కల్పిస్తూ ముందుకు వెళుతుంది.అయితే తాజాగా ఫేస్బుక్ సంస్థ నిర్వహించే ఈ వాట్సప్ యాప్ గత కొన్ని రోజుల నుండి సెక్యూరిటీ కారణాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తోంది.

దీంతో అనేక మందికి కొత్త టెన్షన్ పుట్టుకొస్తుంది.ఇందుకు సంబంధించి తాజాగా వాట్సాప్ ఓటిపి స్కాం ఒకటి బయట పడింది.

అసలు ఓటిపి స్కాం అంటే ఏంటి అంటే.వాట్సాప్ ను మీరు మీ మొబైల్ లో సెట్ చేసుకున్న సమయంలో మీకు ఖచ్చితంగా ఓటిపి లభిస్తోంది.

Advertisement

అది ఎంటర్ చేసిన తర్వాత నే మీరు ఆ నెంబర్ పై లాగిన్ అవ్వగలరు.అప్పుడు మాత్రమే మీ నెంబర్ పై వాట్సప్ అకౌంట్ సెట్ చేయబడుతుంది.

అయితే తాజాగా కొందరు సైబర్ నేరగాళ్లు మీ వాట్సప్ వాటిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు.ఇందుకు సంబంధించి మొదటగా హాకర్స్ వారి మొబైల్ ఫోన్స్ లో వాట్సప్ ఇన్స్టాల్ చేసి అందులో మీ ఫోన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తారు.

అయితే ఆ సమయంలో మీకు ఓటిపి ఖచ్చితంగా వస్తుంది కదా.దాన్ని తెలుసుకోవడానికి హాకర్స్ తెగ ఫోన్స్ లేదా మెసేజ్ చేయడం మొదలుపెట్టారు.అయితే ఆ ఓటీపీని కనుక వారికి చెబితే మీ అకౌంట్ లేదా మీకు సంబంధించిన వివరాలను వారు పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవడానికి ఆస్కారం లభిస్తోంది.

నిజానికి ఈ వాట్సాప్ ఓటిపి స్కాం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.మీ అకౌంట్ నెంబర్ ను గ్రూప్ ఛానల్స్ లో యాడ్ చేసి ప్రమోషన్స్ పేరిట మీ అకౌంట్ నెంబర్ ను ఉపయోగిస్తున్నారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

అంతేకాదు మీ ప్రొఫైల్ కు సంబంధించిన ఫోటోలను కూడా మార్చేస్తున్నారు.అయితే ఇందుకు పరిష్కారంగా కచ్చితంగా ఈ అంశంపై అవగాహన తెలుసుకొని ఉండాలి.కాబట్టి మీరు మీ ఓటిపిని ఎవరికీ ఇవ్వకపోతే ఈ స్కాం నుండి సులభంగా బయటపడవచ్చు.

Advertisement

ఎవరైనా ఫోన్ చేసి లేదా ఏదైనా మెసేజ్ వస్తే వాటిని సైబర్ క్రైమ్ పోలీసులకు అందచేస్తే మీరు ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.కేవలం వాట్సాప్ స్కామ్ మాత్రమే కాదు ఇలాంటి ఎన్నో స్కాం ల నుండి బయటపడాలంటే ఖచ్చితంగా మీ ఓటీపీని ఎవరికి షేర్ చేయకూడదు.

తాజా వార్తలు