ఈ బస్సు షెల్టర్ తో జర భద్రం...!

నల్లగొండ జిల్లా: నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలో పంట కాలువ పక్కన నిర్మించిన బస్సు షెల్టర్ ప్రయాణికులను టెన్సన్ పెడుతుంది.వివరాల్లోకి వెళితే.

ముకుందాపురం నుండి తుమ్మడం కోట మైసమ్మ గుడి దగ్గరకు వెళ్లే రహదారిలో ముదిమాణిక్యం మేజర్ కాలువ వద్ద నిర్మించిన బస్సు షెల్టర్ ప్రమాదకర స్థితికి చేరుకుంది.పంట కాలువ పక్కనే షెల్టర్ నిర్మించడంతో నీరు పారుదలకు రోజురోజుకు బస్సు షెల్టర్ వెనుక నుండి కింది వరకు మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది.

ఈ బస్సు షెల్టర్ వద్దకు నిత్యం తుమ్మడం,నారాయణగూడెం, రేగులగడ్డతో పాటు పలు గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపై బస్సు ఎక్కడానికి వస్తారు.ఇక్కడి నుంచే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి.

దీనితోఎప్పుడు కూలిపోతుందో తెలియని బస్ షెల్టర్ వద్ద నిలుచొని ఉండాలంటే భయంగా ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బస్సు షెల్టర్ కూలిపోయి, ప్రమాదం జరకముందే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement
దేవరకొండ యువతి గిన్నిస్‌ బుక్‌ రికార్డు

Latest Nalgonda News