అసలు 'డెక్సా టెస్ట్' అంటే ఏంటో తెలుసా మీకు? దానివల్ల ఉపయోగాలివే?

BCCI సమావేశం ఆదివారం ముంబయిలో అతిరథమహారధుల సమక్షంలో జరిగింది.BCCI కార్యదర్శి అయినటువంటి జైషా అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది.

కాగా ఈ నేపథ్యంలో భారత జట్టు పనితీరు, ఫలితాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.ఇందులో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

వాటిలో ముఖ్యమైంది యోయో టెస్ట్, డెక్సా టెస్ట్. యోయో టెస్ట్ అంటే ఇంతకు మునుపు జాతీయ జట్టులో ఎంపిక కోసం ఆటగాళ్లకు యోయో ఫిట్ నెస్ టెస్ట్ అనేది నిర్వహించేవారు.

కాగా కొన్నాళ్ల క్రితం నుంచి అది మరుగున పడిపోయింది.కాగా ఇటీవలకాలంలో ప్లేయర్లు ఎక్కువగా గాయపడటంతో మరలా యోయో టెస్టును ప్రవేశపెట్టాలని BCCI నిర్ణయించుకుంది.

Advertisement

ఇక దానితో పాటు డెక్సా టెస్టును కూడా కంపల్సరీ చేసింది.ఇపుడు డెక్సా టెస్ట్ అంటే ఏంటి అనేది చూద్దాము.

డెక్సా (డ్యూయల్ ఎనర్జీ ఎక్స్ రే అబ్సార్ట్పియోమెట్రీ) అనేది.స్పెక్ట్రల్ ఇమేజింగ్ అనే ప్రత్యేక సాంకేతికత.

ఈ సాంకేతికత ద్వారా ఒక వ్యక్తి ఎముక ఖనిజ సాంద్రతను నిర్ణయించవచ్చు.ఈ ప్రక్రియలో వివిధ శక్తి స్థాయిలలో 2 ఎక్స్ రే కిరణాలను వ్యక్తి ఎముక వైపు మరలిస్తారు.

దాని వలన అది అతని ఎముక సాంద్రత, ఎముక యొక్త ఖనిజ సాంద్రతతో కూడిన చార్ట్ ను వెల్లడిస్తుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

ఇకపోతే, సాధారణ మనుషులతో పోలిస్తే క్రీడాకారులు మెరుగైన ఎముక ఖనిజ సాంద్రతను కలిగి ఉంటారు.అయితే ఆటగాళ్లు గాయపడినప్పుడు వారి ఎముకల బలం, సాంద్రత అనేది కాస్త క్షీనిస్తుంది.దాంతో వారు పునరావాసం పొంది కోలుకుని మళ్లీ ఫిట్ గా తయారవుతారు.

Advertisement

అయినప్పటికీ ఈ సాంద్రత మునుపటిలా ఉండదు.అయితే డెక్సా టెస్ట్ దీనిని నివారిస్తుంది.

గాయపడి మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన క్రీడాకారుడు తాజా గాయం బారిన పడకుండా ఈ టెస్ట్ ముందు జాగ్రత్త చర్యగా పనిచేస్తుంది.గాయపడి తిరిగొచ్చిన వారికి ఈ టెస్ట్ నిర్వహిస్తే అతని ఎముక సాంద్రత ఎలా ఉందో తెలుస్తుంది.

దాన్ని బట్టి అతనిని జట్టులోకి తీసుకుంటారు.

తాజా వార్తలు