భారత ఆటగాళ్లపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు..!

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రపంచ కప్ లో ఇండియా స్థాయి తగ్గేలా చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఒక మీడియా ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ద్వారా చేతన్ శర్మ, భారత ఆటగాళ్లపై చేసిన కామెంట్స్ బయటకు వచ్చాయి.

ఇండియన్ టీం క్రికెట్లో ఫిట్గా లేని ఆటగాళ్లు ఫిట్నెస్ కోసం ఇంజక్షన్స్ వాడుతున్నారని తెలిపాడు.అంతేకాకుండా 80% ఫిట్ గా ఉన్న వాళ్లు కూడా 100% ఫిట్నెస్ కోసం ఇంజక్షన్స్ వాడుతున్నారని చెప్పాడు.

ఇలా ఇంజక్షన్స్ వాడే ఆటగాళ్లలో బుమ్రా కూడా ఉన్నాడని తెలిపాడు.

అంతేకాకుండా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై కూడా పలు వ్యాఖ్యలు చేసిన ఆడియో లీక్ బయటకు రావడంతో ప్రస్తుతం చేతన్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు.ఇక కోహ్లీని కెప్టెన్సీ నుండి తప్పించడంలో సెలెక్టర్లు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అని, ఇందులో గంగూలీ ప్రమేయం లేదని తెలిపాడు.కానీ తనను కెప్టెన్సీ నుండి తప్పించింది గంగూలీ అని ఓ మీడియా సమావేశంలో కోహ్లీ, గంగూలీ ని నిలదీశాడని తెలిపాడు.

Advertisement

అంతేకాకుండా రవి శాస్త్రి కోచ్ అవ్వడం వెనుక కోహ్లీ హస్తం ఉందని తెలిపాడు.

సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ లాంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తెచ్చింది తానే అని చేతన్ శర్మ తెలిపాడు.ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్ ఆట లో బాగా రాణించడంతో శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్ ల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని సంచల వ్యాఖ్యలు చేశాడు.ఇక బీసీసీఐ గత టి20 ప్రపంచ కప్ లో టీమిండియా ఓడిపోవడంతో చేతన్ శర్మ ను మినహాయించి మిగతా కమిటీ సభ్యులందరినీ తప్పించడం కూడా చర్చకు దారి తీసింది.

Advertisement

తాజా వార్తలు