ATM నుంచి నగదు తీసుకున్నాక‌ ఈ గ్రీన్ లైట్ చెక్ చేయండి... లేదంటే ఏమవుతుందో తెలుసా?

బ్యాంకు ఏటీఎంకు వెళ్లినప్పుడు ఏటీఎం కార్డు స్లాట్ సరిగ్గా పనిచేస్తోందో లేదో చెక్ చేయండి.

ఒకవేళ అది వదులుగా ఉంటే, ఆ స్లాట్‌లో మీ కార్డ్‌ని అస్సలు పెట్టకండి.

కార్డ్‌ను కార్డ్ స్లాట్‌లోకి పెట్టినప్పుడు.స్లాట్‌లో గ్రీన్ లైట్ వెలుగుతూ కనిపిస్తే ఆ ATM సురక్షితమైనది.

అయితే ఇదే సందర్భంలో ఎరుపు రంగు కనిపించినా లేదా లైటింగ్ కనిపించపోయినా అప్పుడు ఆ ATM ఉపయోగించవద్దు.మోసగాళ్లు ఏటీఎం మెషీన్‌లోని కార్డ్ స్లాట్‌లో పరికరాన్ని ఉంచడం ద్వారా మీ కార్డ్ సమాచారాన్ని దొంగిలించ గలరని సైబర్ నిపుణులు అంటున్నారు.

మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేస్తున్నప్పుడు, పాస్‌వర్డ్ నమోదు చేసే సమయంలో దానిని మరో చేత్తో దాచండి.మీ డెబిట్ కార్డ్‌ నుంచి యాక్సెస్‌ను పొందడానికి హ్యాకర్‌లు తప్పనిసరిగా మీ పిన్ నంబర్‌ని కలిగి ఉండాలి.

Advertisement

హ్యాకర్లు కెమెరాతో పిన్ నంబర్‌ను ట్రాక్ చేయవచ్చు.దీన్ని నివారించడానికి, మీరు ఏటీఎంలో మీ పిన్ నంబర్‌ను నమోదు చేసినప్పుడల్లా, దానిని మరొక చేత్తో మూసి వుంచండి.

దీంతో ఇది సీసీటీవీ కెమెరాలో నమోదుకాదు.హ్యాకర్ల ఉచ్చులో పడి మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

పోలీసులు హ్యాకర్ కు సంబంధించిన వేలి ముద్రలను కనుగొంటారు.సమీపంలో ఎవరి బ్లూటూత్ కనెక్షన్ ఉందో గుర్తిస్తారు.

వీటి ఆధారంగా పోలీసులు.హ్యాకర్ ను పట్టుకుంటారు.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఒకేసారి ఇద్దరు డాక్టర్లతో అఫైర్ పెట్టుకున్న చైనీస్ నర్స్.. చివరికి..?

రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం, స్కామింగ్ లేదా ఫిషింగ్ ద్వారా మోసం జరిగినప్పుడు బ్యాంకుకు మూడు రోజుల్లోగా తెలియజేయాలి.

Advertisement
" autoplay>

తాజా వార్తలు