Bandla Ganesh Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన బండ్ల గణేష్..!!

సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమోషనల్ వాతావరణం నెలకొంది.

ఇక ఇదే సమయంలో కుటుంబ సభ్యులు ఒకే ఏడాదిలో ముగ్గురునీ కోల్పోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఏడాది ప్రారంభంలో.పెద్ద కుమారుడు రమేష్ బాబు సెప్టెంబర్ నెలలో భార్య ఇందిరా దేవి మరణించడంతో కృష్ణ ఎంతగానో కృంగిపోయారు.

ఈ క్రమంలో ఆరోగ్యం విషమించటంతో నిన్న కార్డియాక్ అరెస్ట్ తో పాటు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కోవటంతో కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.అయితే అప్పటికే  ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు తెలపడం జరిగింది.

Bandla Ganesh Condoles Superstar Krishnas Death , Bandla Ganesh, Superstar Kris

ఈ క్రమంలో ఈరోజు ఉదయం 4 గంటల తర్వాత కృష్ణ మరణించినట్లు వైద్యులు ప్రకటన చేశారు.దీంతో కృష్ణ మరణ వార్త తెలుసుకొని చాలామంది ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.దీనిలో భాగంగా నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ కృష్ణ మరణ వార్త పట్ల సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
Bandla Ganesh Condoles Superstar Krishna's Death , Bandla Ganesh, Superstar Kris

సూపర్ స్టార్ కృష్ణ గారు ఇంకా మన మధ్య లేరు అంటే నమ్మలేక పోతున్నాను.మంచితనము మూర్తీభవించిన గొప్ప వ్యక్తి.వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంసభ్యులకు నా ప్రగాఢ సంతాపం.

ఓం శాంతి.ఆయన ఆత్మకు శాంతి కలగాలని పోస్ట్ పెట్టారు.

Advertisement

తాజా వార్తలు