అక్కడ అమ్మాయి పుడితే 12 ఏళ్లకి ఆ పని మొదలెట్టాల్సిందే

చాలా మంది ఇళ్ళల్లో అమ్మాయిలు పుడితే అరిష్టంగా భావిస్తారు.అయితే కొంత మంది మాత్రం అమ్మాయిలని అదృష్టంగా.

ఆ ఇంట్లో మహాలక్ష్మిగా భావిస్తారు.అయితే కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి కొనసాగుతున్న దురాచారాలు ఆడవాళ్ళ జీవితాలలో అంధకారం నింపుతున్నాయి.

పుట్టుక ఒక శాపంగా భావించే పరిస్థితి ఆడపిల్లలకి వచ్చేస్తుంది.అయితే ఆడపిల్ల పుట్టిన ఆ కుటుంబాలు మాత్రం సంబరాలు చేసుకుంటాయి.

కాని వారి సంబరాలు మాత్రం 12 ఏళ్ల వయసు వచ్చేసరికి అమ్మాయిలకి శాపంగా మారుతున్నాయి.

Advertisement

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు జిల్లాల్లో గిరిజన తెగలకి చెందిన బచ్చారా జాతి కట్టుబాట్లు శతాబ్దాల నుంచి కొనసాగుతోన్న వాళ్ల ఆచారం మహిళల పాలిట శాపంలా మారింది.వారి కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలని 12 ఏళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులే నేరుగా వ్యభిచారంలోకి దించుతారు.అలా పడుపు వృత్తి చేసి ఆడపిల్లలు సంపాదించే సంపాదనతో కుటుంబం అంతా జీవిస్తారు.

ఇక ఒక ఆడపిల్లకి వయసు మళ్ళితే అదే కుటుంబంలో ఉన్న మరో ఆడపిల్లని పడుపు వృత్తిలోకి దించుతారు.

తరతరాలుగా అక్కడి గిరిజన తెగలలో ఈ ఆచారం కొనసాగుతోంది.వ్యభిచారం ద్వారా ఈ మహిళలు సంపాదించిన డబ్బే కుటుంబానికి ఆర్థిక ఆధారం.ఇక వ్యభిచారం చేయడానికి అంగీకరించిన మహిళలనే అక్కడ పురుషులు కూడా వివాహం చేసుకుంటారు.

వివాహం అయిన తర్వాత భర్త దగ్గరుండి విటులకి తీసుకొస్తూ ఉంటాడు.ఇక ఆ కుటుంబాలలో మగవారు ఎలాంటి పనులు చెయ్యరు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కేవలం భార్యలు, లేదా కూతుళ్ళు పడుపు వృత్తి చేస్తూ సంపాదించే ఆదాయంతో జీవనం సాగిస్తూ ఉంటారు.అయితే ఈ ఆచారం గురించి బయటి ప్రపంచానికి తెలిసిన అక్కడి ఆడపిల్లల ఆ వృత్తుల నుంచి బయటకి తీసుకొచ్చే వారు లేరు.

Advertisement

ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవు.

తాజా వార్తలు