అందరిని ఆకర్షిస్తున్న బాలయ్య కొత్త కారు.. ధర ఎంతంటే?

మన తెలుగు ప్రముఖ ఓటిటి సంస్థ అయినా ఆహా లో నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే అనే టాక్ షో ద్వారా బుల్లితెర మీదకు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

దసరా పండగ సందర్భంగా ఈ టాక్ షో ను నిన్న గ్రాండ్ గా లాంచ్ చేసారు.

బాలకృష్ణ మొదటిసారి బుల్లితెర మీద ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తుండడం తో అభిమానులు ఈ షో పై ఆసక్తి కనబరుస్తున్నారు.అయితే ఈ షో ప్రారంభానికి బాలయ్య తన కొత్త కారులో రావడంతో ఇప్పుడు అందరి ద్రుష్టి ఈ కారుపై పడింది.

ఈ ఈవెంట్ కు బాలయ్య తన కొత్త లగ్జరీ కారులో వచ్చాడు.నిన్న దసరా సందర్భంగా ఆయుధ పూజ చేస్తారు కాబట్టి బాలయ్య కూడా తన కొత్త బెంట్లీ కారుకు కూడా పూజ చేసి పూల దండతో అలకరించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ కారుకు ఎమ్మెల్యే అనే స్టిక్కర్ కూడా అంటించి ఉంది.ఇక ఈ బెంట్లీ కారు విషయానికి వస్తే.

Advertisement
Balayya Luxury Car Viral On Social Media Details, Viral Photo, Social Media, Nan

ఈ కారును బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చినట్టు టాక్.

Balayya Luxury Car Viral On Social Media Details, Viral Photo, Social Media, Nan

కారు ధర 4 కోట్ల వరకు ఉంటుందట.ఇక ఆహా కోసం బాలయ్య చేస్తున్న టాక్ షో ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.బాలయ్య ప్రెసెంట్ బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.

Balayya Luxury Car Viral On Social Media Details, Viral Photo, Social Media, Nan

ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, టీజర్, పాటలు అన్ని కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి.అఖండ సినిమాలో బాలయ్య మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్య జైశ్వాల్ నటిస్తుండ గా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ద్వారకా క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు