బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం..!

గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే హైదరాబాద్‎తో సహా తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తొచ్చేది బాలాపూర్ విఘ్నేశ్వరుడు.

తొలిసారి వినాయకుడి లడ్డూ వేలాన్ని ప్రారంభించిన బాలాపూరు గణేష్.

, ప్రతి ఏడాది వేలం పాటలో ధర పెరుగతూ కొత్త రికార్డును సృషిస్తోంది.వేలంపాటలో బాలాపూర్ గణేష్ లడ్డూను సొంతం చేసుకునేందుక భక్తులు పోటీ పడుతుంటారు.

మరోవైపు ఈ గణేష్ శోభాయాత్రకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది.బాలాపూర్ గణేష్ బయల్దేరిన తర్వాతే ఓల్డ్ సిటీలోని గణపతులు నిమజ్జనాలు బయల్దేరుతారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయం దగ్గర పడుతుండడంతో., కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారో అని భక్తుల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement

అయితే ఈ క్రమంలో గురువారం సమావేశమైన బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ప్రతి ఏడాది ప్రతిష్టించే 21 అడుగుల విగ్రహానికి బదులుగా ఈ ఏడాది కేవలం ఆరు అడుగుల వినాయక విగ్రహాన్ని మాత్రమే తయారు చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు.

అంతేకాక, ఈ ఏడాది లడ్డూ వేలం పాట నిర్వహించకూడదని కమిటీ నిర్ణయం తీసుకుంది.కరోనా దృష్ట్యా ఈ ఏడాది భక్తుల పూజలు, దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షడు కళ్లెం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.శోభాయాత్ర ప్రభుత్వ అనుమతుల మేరకు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చెప్పారు.

తమ కమిటీ నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలని నిరంజన్ రెడ్డి కోరారు.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు