'భగవంత్ కేసరి' ఊచకోత.. బాలయ్య విశ్వరూపంతో అదిరిన ట్రైలర్!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) ప్రజెంట్ మంచి ఊపు మీద ఉన్నారు.ఇదే ఊపులో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

 Balakrishna's Bhagavanth Kesari Trailer, Balakrishna, Anil Ravipudi, Tollywood,-TeluguStop.com

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి( Bhagavanth Kesari )ఈ సినిమా తో బాలయ్య హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని బాలయ్యతో పాటు ఫ్యాన్స్ కూడా హుషారుగా ఉన్నారు.

ఇక ఇప్పుడు బాలయ్య మంచి ఫామ్ లో ఉండడంతో భగవంత్ కేసరి సినిమాపై ముందు నుండి అంచనాలు బాగా పెరిగాయి.ఇప్పటికే వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియెన్స్ ను బాగా అలరించింది.

Telugu Anil Ravipudi, Arjun Rampal, Balakrishna, Kajal Agarwal, Sreeleela-Movie

తాజాగా మేకర్స్ భారీ స్థాయిలో ట్రైలర్ ఈవెంట్ చేసారు.ఈ ట్రైలర్ ను నిన్న రాత్రి హనుమకొండలో ఘనంగా నిర్వహించగా ఈ ఈవెంట్ లో బాలయ్యతో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.మరి ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ లో ఎన్నో ఎలిమెంట్స్ ను అనిల్ రావిపూడి చూపించాడు.బాలకృష్ణ, శ్రీలీల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి.

Telugu Anil Ravipudi, Arjun Rampal, Balakrishna, Kajal Agarwal, Sreeleela-Movie

ట్రైలర్ మొత్తంలో బాలయ్య రోల్ ను అనిల్ చూపించిన తీరుతో బాలయ్య వన్ మ్యాన్ షోగా నిలిచాడు.ఈ ట్రైలర్ ఆద్యంత గూస్ బంప్స్ తెప్పిస్తూ అనేక సన్నివేశాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నారు.ఇక ఎప్పటి లాగానే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాలయ్య రేంజ్ లోనే హై లెవల్లో ఉంది.

మొత్తంగా ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతుంది.మరి ట్రైలర్ తో అంచనాలు పీక్స్ కు చేర్చిన ఈ సినిమా దసరాకు ఎలాంటి ఊచకోత కొస్తుందో చూడాలి.

కాగా దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇందులో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల( Sreeleela ), విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube