నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గానూ ఇవాళ షెడ్యూల్ విడుదల కానుంది.రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాంతో పాటు తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

 Election Schedule Of Five States Released Today-TeluguStop.com

ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనుంది.మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్న సీఈసీ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.

అలాగే షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది.కాగా తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్ లో 200 అసెంబ్లీ స్థానాలు, ఛత్తీస్ గఢ్ లో 90 అసెంబ్లీ స్థానాలతో పాటు మిజోరాంలోని 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల బృందం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube