ఇజ్రాయిల్ – పాలస్తీనా మధ్య జరుగుతున్న భీకర యుద్ధం గురించి మీరు వినే వుంటారు.పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాదుల( Hamas Terrorists ) ధాటికి ఇజ్రాయెల్ సేనలు నిలవలేకున్నాయి.
ఇరు వర్గాల మధ్య సాగుతున్న దాడి, ప్రతిదాడుల్లో ఇప్పటి వరకు 700 మందికి పైగా మృతి చెందినట్లు తాజా సమాచారం.ఇజ్రాయెల్‌పై హమాస్ తీవ్రవాదులు వేలాది రాకెట్ల మెరుపు దాడులతో మారణ హోమం సృస్టిస్తుండడం మనం చూడవచ్చు.
ఆ ధాటికి ఇజ్రాయిల్ ( Israel ) భూభాగం పెల్లుబుకుతోంది.అటు పాలస్తీనాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్.
గాజా ప్రాంతంలో బాంబుల వర్షం కురిపిస్తోంది.రెండు దేశాల మధ్య యుద్ధంలో ఇటు ఇజ్రాయెల్, అటు గాజా ప్రాంతాల్లో భారీ సంఖ్యలో అమాయక ప్రజలు బలవుతున్న పరిస్థితి.

దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన వాసులు 400 మంది మృతి చెందగా.మరో 1000 మంది వరకు గాయపడినట్లు హమాస్ తీవ్రవాద సంస్థ తనకి తానుగా ప్రకటించుకుంది.కాగా ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడుల్లో గాజాలో 232 మంది మృతి చెందగా.దాదాపు 1,700 మంది గాయపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ భీకర దాడుల నేపథ్యంలో గాజా( Gaza ) ప్రాంతం నుంచి వేలాది మంది పాలస్తీనియన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.గాజా ప్రాంతంలో మరిన్ని దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో వారు.
కట్టు బట్టలతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ క్రమంలోనే గాజాలో హమాస్ తీవ్రవాదుల కార్యాలయమైన 14 అంతస్థుల భవనాన్ని ఇజ్రాయెల్ వైమానిక సేనలు కూల్చివేశారు.

కాగా ఇజ్రాయెల్‌లో పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా వెలికి వస్తున్నాయి.తన స్నేహితుడితో కలిసి మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లిన ఓ 25 ఏళ్ల యువతిని దుండగులు కిడ్నాప్( Kidnap ) చేశారు.దానికి ఆమె తనను వదిలిపెట్టాలని ఎంతగా ప్రాధేయపడినా వినకుండా ఆమెను బైక్‌పై ఎత్తుకెళ్లారు.ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ ఇక్కడ చూడవచ్చు.హమాస్ దాడులను బ్లాక్ డేగా అభివర్ణిస్తూ.శత్రువుపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ప్రకటించారు.
హయాస్‌ను అంతం చేసేందుకు తమ సైనిక సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని ప్రకటించారు.గాజాలోని హమాస్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని.
సమీపంలోని పాలస్తీనా ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి సూచించారు.







