సినిమాలలోకి వచ్చి ఉంటే నా భార్య స్టార్ హీరోయిన్ అయ్యేది.. బాలయ్య అల్లుడి కామెంట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు బాలకృష్ణ( Balakrishna ) సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

ఇప్పటికి వరుస సినిమాలకు కమిట్ అవుతూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.

ఇక బాలకృష్ణ త్వరలోనే తన కుమారుడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.

మోక్షజ్ఞ( Mokshagna ) సినీ ఎంట్రీ కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే తన కొడుకు కంటే తన కూతురు ముందుగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అనే సంగతి తెలిసిందే.బాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు కాగా చిన్న కుమార్తె తేజస్విని( Tejaswini ) కి సినిమాలు అంటే చాలా ఆసక్తి అని తెలుస్తుంది.

సినిమాలపై ఆసక్తి ఉన్న తేజస్విని హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాకపోయినా తెర వెనక మాత్రం బాలయ్య సినిమాలకు ఎంతో కృషి చేస్తూ తన తండ్రి విజయాలకు కారణమవుతోంది.ఇక ఇటీవల బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమం అంత మంచి సక్సెస్ అయ్యింది అంటే దాని వెనుక తేజస్విని కృషి చాలా ఉందని చెప్పాలి.

Advertisement

ఇక ఈమె ప్రముఖ విద్యావేత్త శ్రీ భరత్( Sri Bharath ) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ఇటీవల ఈయన ఎన్నికలలో పోటీచేసి ఎంపీగా కూడా విజయం సాధించారు ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి భరత్ తన భార్య తేజస్విని గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తేజస్విని చాలా క్రియేటివిటీ కలిగిన అమ్మాయని తెలిపారు.

తనలో చాలా టాలెంట్ ఉందని తెలిపారు .ఆమె కనుక ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయి ఉండేదని భరత్ తన భార్య గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని తేజస్విని కనుక హీరోయిన్ గా వచ్చి ఉంటే నిజంగానే సక్సెస్ అయ్యి ఉండేవారు అంటూ అభిమానులు కూడా ఈ విషయంపై కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు