వీర సింహారెడ్డి తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ పారితోషికం ఎంతో తెలుసా?

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొంది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా లో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర లో కనిపించిన విషయం తెలిసిందే.

గతంలో తెలుగు చిత్రాల్లో చేసిన పాత్రలకు పూర్తి విభిన్నమైన పాత్ర ను వరలక్ష్మి ఈ సినిమా లో చేయడం జరిగింది.

బాలకృష్ణ తో పోటీ పడి మరి కొన్ని సన్నివేశాల్లో నటించడం తో ఈమెకు టాలీవుడ్ లో మరింత గుర్తింపు దక్కింది.ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క రెమ్యూనరేషన్ అమౌంట్ పెరిగినట్లు సమాచారం అందుతుంది.

మొన్నటి వరకు కోటి రూపాయలకు లోపు రెమ్యూనరేషన్ తీసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ వీర సింహా రెడ్డి సినిమా తర్వాత ఏకంగా కోటిన్నర రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ యొక్క తెలుగు క్రేజ్ మరియు రెమ్యూనరేషన్‌ అమౌంట్ పెరిగింది.కనుక ఇక నుండి ఆమె వరుసగా తెలుగు లో సినిమా లు చేసే అవకాశాలు ఉన్నాయి.కేవలం లేడీ విలన్ పాత్ర లో మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రొమాంటిక్ హీరోయిన్ గా కూడా ఆమె నటించేందుకు ఆసక్తిని కనబరుచుతోంది.

Advertisement

తమిళనాడు రొమాంటిక్ హీరోయిన్ గా చాలా సినిమాలనే చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు లో మాత్రం అలాంటి పాత్రలు చేయలేదు.సీనియర్ హీరోలకు జోడి గా ఈమె అలాంటి పాత్రలు చేస్తే బాగుంటుంది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కోటిన్నర పారితోషికం ఇస్తే సీనియర్ హీరోలకు రొమాంటిక్ హీరోయిన్ పాత్ర ను చేసేందుకు వరలక్ష్మి శరత్ కుమార్ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.మరి వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా తెలుగు లో ఎప్పుడు నటిస్తుంది అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు