విగ్గు పెట్టుకుంటాడంటూ బాలయ్య గురించి ఎగతాళిగా మాట్లాడింది అతనేనా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ( Balakrishna ) ముక్కుసూటిగా ఉంటారనే సంగతి తెలిసిందే.

ముందు ఒక విధంగా వెనుక ఒక విధంగా మాట్లాడటం బాలయ్యకు నచ్చదు.

నెగిటివ్ కామెంట్లను సైతం పాజిటివ్ గా తీసుకునే మంచి మనస్సు బాలయ్యకు ఉంది.ఈ మధ్య కాలంలో బాలయ్య నటిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ సైతం తెరపైకి వస్తుండటం గమనార్హం.

అయితే బాలయ్య భగవంత్ కేసరి ( Bhagwant Kesari )ఈవెంట్ లో విగ్గు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత రెండు దశాబ్దాల నుంచి బాలయ్య విగ్గు వాడుతున్నారు.

సినిమాసినిమాకు బాలయ్య లుక్ లో వేరియేషన్ కనపడటం వెనుక విగ్గు కూడా ఒక కారణమనే సంగతి తెలిసిందే.అఖండలో అఘోరా పాత్రలో మాత్రం బాలయ్య విగ్గు లేకుండా కనిపించారు.

Advertisement

బాలయ్యకు విగ్గు సరిగ్గా సెట్ కాకపోవడం వల్ల వీరభద్ర, రూలర్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారనే సంగతి తెలిసిందే.

దర్శకుడు బోయపాటి శ్రీను( Boyapati Srinu ) మాత్రం తన సినిమాలలో బాలయ్యను మరింత అందంగా చూపించే ప్రయత్నం చేస్తారు.బాలయ్య విగ్గుల కోసం లక్షల్లో ఖర్చు చేస్తారని విదేశాల నుంచి విగ్గులు వస్తాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది.అప్పట్లో కారవాన్ లు లేవని చాప, దిండు తీసుకుని నేలపై పడుకునేవాళ్లమని ఆ సమయంలో విగ్గు తీసేసేవాడినని బాలయ్య చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో ఒకాయన నేను విగ్గు పెట్టుకుంటానని ఎగతాళిగా మాట్లాడాడని బాలయ్య అన్నారు.అవునయ్యా నేను విగ్గు పెట్టుకుంటానంటూ బాలయ్య చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో నువ్వు ఎందుకు గడ్డం పెట్టుకున్నావని ఆ నటుడిని అడిగానని మనదంతా ఓపెన్ బుక్ అని ఎవరికీ భయపడేది లేదని బాలయ్య తెలిపారు.అయితే బాలయ్య విగ్గు గురించి అడిగింది పరభాషా నటుడు అని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆ నటుడు నటించాడని 2004 సంవత్సరం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.తన గురించి వచ్చే విమర్శలకు ధీటుగా బదులిచ్చే బాలయ్యను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు