ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాల‌కృష్ణ‌..?

దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడిగా అటు న‌ట‌న‌లోను, ఇటు రాజ‌కీయంగాను వార‌స‌త్వం అందిపుచ్చుకున్న బాల‌కృష్ణ ప్ర‌స్తుతం సినిమాల్లోను, రాజ‌కీయాల్లోను రాణిస్తున్నాడు.త‌న తండ్రి ప్రాథినిత్యం వ‌హించిన హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచే రాజ‌కీయారంగ్రేటం చేసిన బాల‌య్య గ‌తంలో త‌న తండ్రి సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న‌కు స‌హాయ‌స‌హ‌కారాలు అందిచేవాడు.

త‌ర్వాత చాలా రోజుల‌కు బాల‌య్య డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.2014 ఎన్నిక‌ల్లో బాల‌య్య పొలిటిక‌ల్ ఎంట్రీ చేయ‌డ‌మే ఓ సంచ‌ల‌నం.బాలయ్య ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు కొత్త‌గా ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర‌లో తొలి ప్ర‌భుత్వ‌మే టీడీపీది అయ్యింది.

ఇక స‌మైక్యాంధ్ర కాస్తా ఏపీ, తెలంగాణ‌గా విడిపోవ‌డంతో చంద్ర‌బాబు టీడీపీకి జాతీయ అధ్య‌క్షుడు అయ్యాడు.అనంత‌రం ఏపీ టీడీపీకి కిమిడి క‌ళా వెంక‌ట్రావు అధ్య‌క్షుడిగా ఉంటే తెలంగాణ టీడీపీ శాఖ‌కు ఎల్‌.

ర‌మ‌ణ అధ్య‌క్షుడిగా ఉన్నారు.ఇక తాజా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో క‌ళా వెంక‌ట్రావు కేబినెట్‌లోకి వెళ‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అదే జ‌రిగితే ఆయ‌న ప్ర‌స్తుతం నిర్వ‌హిస్తోన్న ఏపీ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో చంద్ర‌బాబు వియ్యంకుడు బాల‌య్య పేరు వినిపిస్తోంది.ఎన్టీఆర్ త‌న‌యుడిగా ఉన్నా బాల‌య్య ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌ద‌వులు చేప‌ట్ట‌లేదు.

Advertisement

ఈ క్ర‌మంలోనే ఆయ‌న్ను ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా చేయాల‌న్న చ‌ర్చ స‌డెన్‌గా తెర‌మీద‌కు వ‌చ్చింది.ఈ ప‌ద‌వి కాపుల‌కు ఇవ్వాల్సి వ‌స్తే ప్ర‌స్తుత హోం మంత్రి చిన‌రాజ‌ప్పకు ఇస్తార‌ని కొంద‌రు అంటుంటే, హ‌రికృష్ణ ఈ ప‌ద‌వి ఎక్క‌డ అడుగుతాడోన‌న్న డౌట్‌తోనే చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా బాల‌య్య పేరును తెర‌మీద‌కు తెచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ విష‌యం ప్ర‌స్తుతం పార్టీలో ట్రెండ్ అవుతుండ‌డంతో హ‌రికృష్ణ సైతం నాడు త‌న తండ్రి నిర్వ‌హించిన ప‌ద‌విని నేడు త‌న త‌మ్ముడు బాల‌య్య చేప‌డితే త‌న‌కూ ఆనంద‌మే అన్న‌ట్టు తెలుస్తోంది.ఇక త‌మ్ముడు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఎంపికయ్యందుకు హ‌రికృష్ణ కూడా స‌పోర్ట్ చేయ‌డం కూడా సంచ‌ల‌నంగానే మారింది.

మ‌రి చంద్ర‌బాబు బాల‌య్య‌ను ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఎంపిక చేసే సాహ‌సం ఎంత వ‌ర‌కు చేస్తార‌నేది చూడాలి.

షాకిచ్చిన అనితా ఆనంద్ ... కెనడా ప్రధాని రేసు నుంచి ఔట్
Advertisement

తాజా వార్తలు