ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కాంబినేషన్స్, మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది.చాలా మంది యువ హీరోలు కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి టాలీవుడ్ లో చరిత్రలో నిలిచిపోయే విధంగా భారీ మల్టీ స్టారర్ సినిమా తీస్తున్నారు.ఇక కథ డిమాండ్ బట్టి కుర్ర హీరోలు ఇమేజ్ చట్రంలో ఉండిపోకుండా కొత్తదనం చూపించడానికి మల్టీ స్టార్ కథలతో వస్తున్నారు.
కొత్త మంది హీరోలితే విలన్ లుగా కూడా నటించి సత్తా చాటుతున్నారు.ఇప్పుడు టాలీవుడ్ మరో క్రేజీ మల్టీ స్టారర్ కి రంగం సిద్ధం అవుతుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది.
మలయాళంలో ఇటీవల విడుదలై సూపర్ అయిన చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ అనే సినిమా తెలుగులో రీమేక్ హక్కులని నిర్మాత సూర్య దేవర నాగవంశీ వున్నారు.ఈ కథలో రెండు బలమైన పాత్రలు ప్రధానమైనవిగా కనిపిస్తాయి.
ఇందులో ఒక పాత్ర కోసం ఆయన బాలకృష్ణను అనుకున్నారు.మరో పాత్ర కోసం చాలా మంది పేర్లు పరిశీలించి ఫైనల్ గా మంచు విష్ణు అయితే కరెక్ట్ అని భావించినట్లు సమాచారం.
ఈ నేపధ్యంలో వీరిద్దరి కాంబినేషన్ ని సెట్ చేయడానికి నిర్మాత సిద్ధం అవుతున్నారు.గతంలో బాలకృష్ణ, మంచు మనోజ్ తో ఊకొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు.
ఈ నేపధ్యంలో ఈ కాంబినేషన్ సెట్ చేయడం పెద్ద కష్టమైన విషయం కాదని నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తుంది.