బాలయ్య, కాజల్ పై పాట.. సినిమాకే హైలైట్ అవ్వబోతుందట

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ మరియు వీర సింహా రెడ్డి చిత్రాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ ఒక సినిమా ను చేస్తున్నాడు.

ఇప్పటి వరకు ఆ సినిమా కు టైటిల్ ఖరారు చేయలేదు.కానీ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ విషయమై అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు.

Balakrishna And Kajal Agarwal Combo Movie And Song ,balakrishna , Kajal Aggar

ఇక ఈ సినిమా లో శ్రీ లీల( Sreeleela ) కీలక పాత్రలో కనిపించబోతోంది.బాలకృష్ణకు కూతురు పాత్ర లో ఆమె కనిపించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది.ఇక కాజల్ అగర్వాల్ మరియు బాలకృష్ణ మొదటి సారి సినిమా లో కలిసి నటిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

Advertisement
Balakrishna And Kajal Agarwal Combo Movie And Song ,balakrishna , Kajal Aggar

ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఒక రొమాంటిక్ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

Balakrishna And Kajal Agarwal Combo Movie And Song ,balakrishna , Kajal Aggar

పెళ్లి అయ్యి ఒక బాబు కు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్ ఈ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడం.అది కూడా బాలకృష్ణ సినిమా లో అవ్వడం తో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గతం లో బాలకృష్ణ తో నటించే అవకాశం రెండు మూడు సార్లు వచ్చినా కూడా ఏదో కారణం చెప్పి తప్పించుకుంటూ వచ్చిన కాజల్ అగర్వాల్ ఈ సారి మాత్రం బాలకృష్ణ తో నటించేందుకు సిద్ధమయింది.

Balakrishna And Kajal Agarwal Combo Movie And Song ,balakrishna , Kajal Aggar

ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సంవత్సరంలోనే వీరి కాంబినేషన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.మరో వైపు కాజల్ ఇండియన్ 2( Indian 2 ) లో కూడా నటిస్తోంది.

ఈ రెండు సినిమా లు హిట్ అయితే కాజల్‌ మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు