50 రోజుల సెంటర్ల విషయంలో భగవంత్ కేసరి రికార్డ్.. అన్ని థియేటర్లలో బాలయ్య చరిత్ర సృష్టించాడుగా!

ప్రస్తుత కాలంలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో సినిమా 50 రోజుల పాటు ప్రదర్శితం కావడం సులువైన విషయం కాదు.

పెద్ద సినిమా విడుదలైన నెల రోజులకే ఓటీటీలో అందుబాటులోకి వస్తుండటంతో 50 రోజుల పాటు థియేటర్లలో సినిమా ఆడటం గగనమైపోతుంది.

అయితే 50 రోజుల సెంటర్ల విషయంలో భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )రికార్డ్ సృష్టించింది.రెండు వారాల క్రితమే ఓటీటీలో అందుబాటులోకి వచ్చినా థియేటర్లలో ఈ సినిమా హవా కొనసాగుతోంది.15 సెంటర్లలో ఈ సినిమా అర్ధ శతదినోత్సవం జరుపుకోగా అందులో 11 డైరెక్ట్ సెంటర్లు ఉంటే నాలుగు షిప్ట్ ఉన్నాయి.బాలయ్య సినిమాకే ఇలాంటి రికార్డులు సాధ్యమవుతాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

రాయలసీమలో భగవంత్ కేసరి ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితం కావడం గమనార్హం.ఈ మధ్య కాలంలో బాలయ్య మాత్రమే వరుసగా మూడు 50 డేస్ సినిమాలు ఉన్న హీరోగా నిలిచారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

15 థియేటర్లు అంటే తక్కువ థియేటర్లు అయినా ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం బాలయ్య చరిత్ర సృష్టించారనే చెప్పాలి.మదనపల్లిలోని కృష్ణా థియేటర్, హిందూపురంలోని గురునాథ్ థియేటర్, గాజువాకలోని కన్య థియేటర్, ఏలూరులోని సత్యనారాయణ స్క్రీన్1, గాజువాకలోని కన్య థియేటర్ భగవంత్ కేసరి డైరెక్ట్ థియేటర్లుగా ఉన్నాయి.గుంతకల్లులోని వాసవి, అనంతపూర్ లోని గంగ, ఎమ్మిగనూరు శ్రీనివాస, ఖమ్మం కేపీఎస్ థియేటర్లలో షిఫ్ట్ విధానంలో ఈ సినిమా ఆడింది.

Advertisement

బాలయ్య( Balakrishna ) వరుస విజయాలు ప్రేక్షకులకు సంతోషాన్ని కలిగిస్తుండగా భవిష్యత్తు సినిమాలు కూడా బాలయ్యకు భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.భగవంత్ కేసరి రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.

ఓటీటీలో సైతం ఈ సినిమా సంచలన రికార్డులను సొంతం చేసుకుంటోంది.బాలయ్య సినిమాలపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు