ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మూడు రాజధానుల విషయం ఎంతో చర్చనీయాంశంగా మారింది.అయితే ఇందులో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు తదితర ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ అంశానికి పలువురు మంత్రులు, ప్రతిపక్షాల నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మరోవైపు కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి ఏకీభవిస్తున్నారు.
తాజాగా నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ ఈ అంశానికి తన మద్దతు తెలిపాడు. దీంతో అతడిపై తెలుగుదేశం పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ అంశానికి తీవ్రంగా వ్యతిరేకత తెలియజేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు తన తోడల్లుడు అయినటువంటి శ్రీ భరత్ ఇలా చేయడంతో తెలుగుదేశం పార్టీలో చర్చనియాంశమైంది.

అయితే ఇది ఇలా ఉండగా మొన్న జరిగిన ఎన్నికల్లో విశాఖ ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయాడు.పెద్దగా రాజకీయ అనుభవం లేని శ్రీ భరత్ చంద్రబాబు సలహా లేకుండా ఎటువంటి వ్యాఖ్యలు కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయడు.అలాంటిది చంద్రబాబు ప్రమేయం లేకుండానే తన మద్దతు తెలిపాడా లేక చంద్రబాబు మల్లె ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
.