గత కొద్ది రోజులుగా అమరావతిని రాజధానిగా మారిస్తే సహించేది లేదంటూ అక్కడి రైతులు ఆందోళన చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ ఆందోళన నేపధ్యంలో కొద్ది రోజుల క్రితం కొంత మంది రైతులు మంగళగిరి ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి తమ నిరసనని తెలియజేసారు.
అలాగే ఎమ్మెల్యే శ్రీదేవి కూడా కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.తాజాగా మంగళగిరి వచ్చిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీడియా ముందుకి వచ్చారు.
తనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.తన ఇంట్లో చాలా రోజుల తర్వాత జరుగుతున్న పెళ్లి కావడంతో నాలుగు రోజులు హైదరాబాద్ లో ఉంటే అనవసర రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.
కుప్పంలో గత 40 ఏళ్లుగా చంద్రబాబు కనిపించడం లేదని ఫిర్యాదు చేసారని దానికి టీడీపీ నేతలు ఏం సమాధానం చేరుతారని ప్రశ్నించారు.తాను ఎప్పటికి రైతుల పక్షపాతిని అని, రైతుల తరుపున మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
అయితే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తను స్వాగాతిస్తున్నానని తెలిపారు.జగన్ అమరావతి రైతులందరికి కచ్చితంగా న్యాయం చేస్తారని తెలిపారు.
ఇక్కడి రైతులకి ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగదని తెలిపారు.







