ఇదేందయ్యా ఇది.. బైక్‌కి ట్రాక్టర్ టైర్ అమర్చిన యువకుడు.. వీడియో వైరల్...

సోషల్ మీడియాలో ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు కనిపిస్తుంటాయి.ఇవన్నీ సామాన్యులు చేసినవే.

అందువల్ల వాటిని చూసినప్పుడు మనం ఆశ్చర్యపోక తప్పదు.

ఇప్పటికే చాలామంది తమ బుర్రకు పదును పెట్టి తమ ప్రయోగాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

ఇటీవల ఒక వ్యక్తి మామూలు కారును రోల్స్ రాయల్స్( Rolls Royce ) కారుగా తీర్చిదిద్దిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ కోవకు చెందిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.ఇందులో ఓ బైక్ రైడర్ బజాజ్ పల్సర్‌( Bajaj Pulsar ) ముందు టైరు తీసేసి దాని భాగంలో ఒక ట్రాక్టర్ టైర్ అమర్చాడు.

Advertisement

@mrhifixyz అనే వినియోగదారు ఎక్స్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, సదరు యువకుడు పల్సర్ బైక్ ముందు చక్రానికి ట్రాక్టర్ వీల్‌ను( Tractor Wheel ) జోడించి, ఆపై దానిని సులభంగా రోడ్డుపై నడపడం కనిపించింది.సాధారణంగా ఇలాంటి ఇన్నోవేటివ్ బైక్స్ కనిపించడం చాలా అరుదు.

అందుకనే స్థానికులు ఈ బైక్ చూసి అబ్బురపడ్డారు.

ట్రాక్టర్ టైరును బైక్ ముందు చక్రానికి చాలా తెలివిగా కనెక్ట్ చేసావ్ అంటూ ఆల్రెడీ పై పొగడ్తల వర్షం కూడా కురిపించారు.మంత్రముగ్దులను చేసే ఈ స్టంట్ త్వరగా వైరల్ అయి సంచలనంగా మారింది.వైరల్ వీడియో ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా లైక్‌లను లక్షల్లో వ్యూస్ ను సంపాదించింది.

దీన్ని చూసిన కొందరు నెటిజన్లు సదరు రైడర్‌ను పొగుడుతుంటే మరి కొందరు మాత్రం బైక్ ఇలా తయారు చేయడం వల్ల దాన్ని రైడ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని అంటున్నారు.ఇలాంటివి చేయకపోవడమే బెటర్ అని మరికొందరు సూచిస్తున్నారు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఛీ.. ఛీ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. చివరకు?

ఏది ఏమైనా అతడు చాలా వెరైటీగా ఈ బైక్‌ తయారుచేసి అందరిని ఆకట్టుకుంటున్నాడు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు