17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కమాండెంట్ యమ్.

పార్థసారథి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ యమ్.పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ దేశంలో బడుగు, బలహీన వర్గాల సాధికారతకు కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు.దేశ రాజకీయ యవనికపై జగ్జీవన్ రామ్ చెరగని ముద్రవేశారని కొనియాడారు.

Babu Jagjeevan Ram Jayanti Celebrations At 17th Police Battalion Sardapur , Jawa

నాలుగు దశాబ్దాల పాటు నవభారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని అన్నారు.భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ప్రజలకు న్యాయమైన సమాజాన్ని కల్పించడానికి బాబు జగ్జీవన్ రామ్ దళిత జనాభా యొక్క సామాజిక, రాజకీయ హక్కుల కోసం ధైర్యంగా వాదించారు.

తరువాత జగ్జీవన్ రామ్ 1946లో జవహర్లాల్ నెహ్రు యొక్క తాత్కాలిక ప్రభుత్వ మంత్రివర్గం లో అతి పిన్న వయస్కుడు అయ్యాడు అని అన్నారు.తదుపరి స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి అయ్యాడు.1952 వరకు కార్మిక మంత్రిగా పని చేశాడు.బాబు జగ్జీవన్ రామ్ తన పదవీ కాలంలో హరిత విప్లవం విజయవంతంగా అమలు చేయడానికి కీలక పాత్ర పోషించారు.

Advertisement

ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.అలాగే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత దేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్‌కు దక్కిందని అన్నారు.

దేశ ప్రజల సంక్షేమం కోసం వారి శ్రేయస్సు కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టిన మహనీయులలో బాబు జగ్జీవన్ ఒకరని కొనియాడారు.మహాత్మగాంధితో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తుచేసారు.

ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?
Advertisement

తాజా వార్తలు