సీరియల్ గా రాబోతున్న బాహుబలి

ఇక్కడ ఎవరికైనా ఇంగ్లీష్ టీవి సీరియల్స్ చూసే అలవాటు ఉందా ? సీరియల్స్ అంటే మన తెలుగు సీరియల్స్ లాంటివి అనుకునేరూ .

ఇలాంటి ఎడుపులు, ఓవర్ యాక్షన్, మెలోడ్రామా ఏమి ఉండదు ఇంగ్లీష్ టీవి సీరీస్ లో.

అక్కడి సీరియల్స్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి.మన ప్రియాంక చోప్రా అమెరికా వెళ్ళి "క్వాంటికో" అనే టీవి సీరియల్ లో నటిస్తోంది అంటే అర్థం చేసుకోండి అక్కడి సీరియల్స్ ఎలా ఉంటాయో ! గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే ఇంగ్లీష్ టీవి సీరిస్ ఎప్పుడైనా చూశారా? పేరైనా విన్నారా ? మన బాహుబలి సినిమాని తలపిస్తుంది ఆ సీరియల్.ఇప్పుడు ఇంగ్లీష్ టీవి సీరీస్ మాదిరిగా, బాహుబలి కూడా ఓ సీరియల్ గా రాబోతోందట.

అవును, సీజన్స్ కింద విభజించి, మాహిష్మతి సామ్రాజ్య కథలను ఓ టీవి సీరియల్ గా రూపొందించే పనిలో ఉన్నారట రచయిత విజయేంద్ర ప్రసాద్.ఇప్పటికే హ్యారి పాటర్ మాదిరిగా బాహుబలి కామిక్ పుస్తకాలు, బ్యాట్ మెన్, స్పైడర్ మెన్ మాదిరిగా యానిమేషన్ సిరీస్ ప్లాన్ చేసిన బాహుబలి మేకర్స్, ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్, సూట్స్, క్వాంటికో, సూపర్ గర్ల్ మాదిరిగా టీవి సీరీస్ తీసుకరాబోతున్నారు.

తెలుగు సినిమా హాలివుడ్ బాటలో పయనిస్తోంది కదూ !.

Advertisement
Pokiri : పోకిరి సినిమా ఎందుకు ఆడిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు

తాజా వార్తలు