బాహుబలి - బ్రేకింగ్ న్యూస్

బాహుబలి అంతర్జాతీయ మార్కెట్ లోకి కాలు పెడుతోంది.

తోలి ఫేజ్ లో భారతీయ భాషలు హిందీ,తెలుగు,తమిళం,మళయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు చైనా మార్కెట్ లోకి చైనీస్ భాషలో వెళ్లనుంది.

ఈ ప్రకటన చాలాకాలం క్రితమే చేసినా, విడుదల ఎప్పుడు అనేది ప్రకటించలేదు.అప్పుడు ఇప్పుడు అని ఊరించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మే నెలలో బాహుబలి-ది బిగినింగ్ ని చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.ఈ-స్టార్ ఫిలిమ్స్ అనే సంస్థ బాహుబలి చైనా హక్కులని కొనుక్కుంది.

పెట్టిన భారిమోత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు భారి రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు.దాదాపు 6,000 స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం.

Advertisement

ఇది భారతీయ చిత్రాల్లో రికార్డు.చైనాలో 100 కోట్ల మార్కెట్ కలిగి ఉన్న ఆమీర్ ఖాన్ చిత్రాల కన్నా పెద్ద రిలీజ్.

మరి అక్కడ కూడా బాహుబలి అద్భుతాలు సృష్టిస్తుందా ? ఆమీర్ ఖాన్ పీకే 120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది చైనాలో, ఆ రికార్డుని బద్దలు కొట్టేస్తుందా ? మన జక్కన్న పేరు చైనాలో కూడా మారుమ్రోగిపోతుండా ? అన్నిటికి సమాధానం మే నెల చెప్పేస్తుంది.

.

మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?
Advertisement

తాజా వార్తలు