మొదలైన అయోధ్య రామ‌మందిరం నిర్మాణ పనులు... రాగిని విరాళం ఇవ్వాలంటున్న ట్ర‌స్టు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ...!

ఇటీవల అయోధ్య రామ మందిర నిర్మాణం లో భాగంగా భూమిపూజ నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ఇక ఆలయ నిర్మాణ పనులలో భాగంగా నేడు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు రామాలయ నిర్మాణం నిర్వహణ సంబంధించి పలు అంశాలు చర్చించారు.

ఈ కార్యక్రంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ సంపత్ రాయి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

దేశంలోని హిందువులు ఆలయ నిర్మాణం కోసం రాగిని విరాళం ఇవ్వాలని ఆయన కోరారు.ఆలయం నిర్మాణం కోసం 1990లో శిలలు దానం చేసినట్లు విధంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిందువులందరూ కూడా రాగిని దానం చేయాలని ఆయన కోరారు.

కనీసం ఆలయం వెయ్యి సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉండే విధంగా ఆలయాన్ని నిర్మించబోతున్నామని జనరల్ సెక్రటరీ సంపత్ రాయి తెలియజేశారు.ఇకపోతే రామమందిర ఆలయ నిర్మాణ బాధ్యతలను ఎల్ఎన్టి కంపెనీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Advertisement

ఇక భూ పరీక్ష కోసం ఐఐటి చెన్నై ఇంజనీర్లను ఇప్పటికే అయోధ్యకు పిలిపించినట్లు సమావేశంలో తెలిపారు.అటుపై ఎప్పుడైనా అనుకోని పరిస్థితిలో భూకంపాలు సంభవించినా కూడా ఆలయాన్ని దర్శించుకునే విధంగా నిర్మాణం చేపడుతున్నారు.

అందుకోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని సంపత్ రాయి తెలియజేశారు.ఇక ఆలయ నిర్మాణం కోసం పదివేల రాగి రాడ్లు అవసరమవుతాయని తెలియజేశారు.

ఇక ఆలయ నిర్మాణం కోసం పూర్తిగా రాగి నే ఉపయోగిస్తున్నట్లు, మరి ఏ ఉక్కు పదార్థం ఉపయోగించడం లేదని తెలిపారు.ఇక ఆలయ నిర్మాణం కోసం కనీసం మూడు సంవత్సరాలకు పైనే సమయం పడుతుందని సంపత్ రాయ్ తెలిపారు.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు