ఓటు హక్కు నమోదుపై అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఓటు హక్కు నమోదుఫై ( స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రా్రాల్ పార్టిసిపేషన్ )ఆద్వర్యంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు.

జిల్లా సమీకృత సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూల్స్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, వ్యవసాయ, నర్సింగ్, ఐటీఐ కళాశాలల నుంచి విద్యార్థులను క్యాంపస్ అంబాసిడర్ లాగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా వోటర్ హెల్ప్ లైన్ యాప్(వి ఎచ్ ఏ ) లో అందుబాటులో ఉన్న సేవలు, ఓటు హక్కు నమోదుకు అర్హత వయసు, ఆన్లైన్, ఆఫ్ లైన్ లో ఓటు హక్కు ఎలా నమోదు చేయాలి, ఫారం నెంబర్ 6,7,8 వినియోగం, ఓటు హక్కు నమోదులో తరచూ చేసే తప్పులు ఎలా నివారించాలి తదితర అంశాల ఫై వివరించారు.అనంతరం అధికారులు మాట్లాడారు.

గ్రామాలు, పట్టణాల్లో 18 ఏండ్ల వయసు నిండిన వారంతా ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీఈఓ రమేశ్ కుమార్, ఏపీడీ (నోడల్ ఆఫీసర్) నరసింహులు, డీఎంఎల్టీ మహేందర్ రెడ్డి అధికారులు రెహమాన్, బీఎల్ఓలు తదితరులు ఉన్నారు.

అబాగ్యులకు బియ్యం వితరణ అమ్మ ఫౌండేషన్ ఛైర్మెన్ ఔదార్యం
Advertisement

Latest Rajanna Sircilla News