మానసిక ఆరోగ్యం పై విద్యార్థులకు అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా మానసిక ఆరోగ్యం ప్రోగ్రామ్ లో భాగముగా ఇంచార్జీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డా.ఎస్.

రజిత( Dr.S.Rajita ) ఆదేశాల మేరకు డా.ప్రవీణ్ కుమార్ జిల్లా ఆసుపత్రి మానసిక వైద్యు నిపుణులు, జిల్లా ప్రోగ్రామ్ కొ-ఆర్డినేటర్ ప్రతాపరెడ్డి జడ్.పి.హెచ్.ఎస్ చంద్రంపేట, యుపిఎస్ చిన్నబోనాల స్కూల్ లను సందర్శించి 8,9,10 తరగతుల విద్యార్థిని విద్యార్థులకు మానసిక ఆరోగ్యముపై శుక్రవారం అవగాహన కల్పిస్తూ పరీక్షల సమయములో ఎలా ప్రిపేర్ కావాలి, మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, మానసికoగా,శారీరకముగా మరియు ఆరోగ్యముగ ఎలా ఉండాలో అవగాహన కల్పించడం జరిగినది.

మానసిక ఆరోగ్యంకు సంబందించిన సమస్యల పరిష్కారం కొరకు 14416 హెల్ప్ లైన్ నంబర్ ను వినియోగించుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమములో జడ్పీహెచ్ఎస్, చంద్రంపేట యుపిఎస్ చిన్నబోనాల ప్రదానోపాద్యాయులు శ్రీనివాస్, బి.కనుకయ్య పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News