దేశంలో దారుణం.. వైద్య,ఆరోగ్య పరిస్థితులపై షాకిచ్చే నివేదిక.. ?

దేశంలో మనుషులకు ఉచితంగా అందవలసింది, కావలసింది, విద్య, వైద్యం.వీటిని మాత్రం అందనంత దూరం పెట్టి, అనవసరం అయిన వాటిని ప్రజలకు ఉచితంగా అందిస్తూ జనాన్ని సోమరులుగా మారుస్తున్నారు పాలకులు అనే అపవాదు మనదేశ రాజకీయ నేతలకు ఎప్పుడో అంటుకుంది.

 Atrocities In The Country Shocking Report On Medical And Health Conditions, Indi-TeluguStop.com

ఏదైన కష్టం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది అంటారు.అలాగే దేశంలో విద్యా, వైద్యం నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించబడుతుంది.సామాన్యులకు అందని స్దాయిలో ఉంది.ఈ విషయాన్ని కరోనా అనే వైరస్ బట్టబయలు చేసింది.

ఎందుకంటే కోవిడ్ బాధితులు పెరుగుతున్నారు కానీ వీరికి సరిపడ వైద్య సిబ్బంది లేరట.కాగా డాక్టర్లు తక్కువ రోగులు ఎక్కువ అయితే ఎలా ఉంటుందో ఈ కరోనా కళ్లకు కట్టినట్లుగా చూపించింది.

పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతు స్వయానా 15వ ఆర్థిక సంఘం నిర్వహించిన తాజా నివేదికల్లో వెల్లడైన వాస్తవం ఇది.కాగా ఈ నివేదిక ప్రకారం 1,511 మందికి కేవలం ఒకే ఒక్క డాక్టర్, 670 మందికి ఒకే నర్సు ఉన్నట్లుగా పేర్కొంది.ఈ పరిస్దితి ఇలాగే కొనసాగితే ఎన్ని దారుణాలు ఎదుర్కోవలసి వస్తుందో ఉహకు అందడం కొంచం కష్టమే.ఇకనుండైన ఎన్నికల కొరకు పెట్టే ఖర్చులో కొంతైన విద్యా, వైద్యానికి పెడితే మంచిదని సున్నితంగా సూచిస్తుంది ఆర్ధిక సంఘం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube