అల్బానీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో KN95 మాస్కుల పంపిణీ

న్యూయార్క్ నగరాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.

అత్యధిక కోవిడ్-19 పాజిటివ్ కేసులతో ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇక్కడి వైద్యలు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ చాలా శ్రమిస్తున్నారు.

కరోనా కారణంగా మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం, అందులో 20 శాతం వైద్య రంగానికి చెందినవారు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ఉండటంతో, వారికి అండగా నిలిచేందుకు అల్బానీ తెలుగు అసోసియేషన్ ‘గోఫండ్‌మి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ దినేష్ దొండపాటి తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్(పీపీఈ) కిట్లను స్థానిక ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు అందించేందుకు పలువురి నుండి విరాళాలను సేకరించారు.

కేవలం రెండు వారాల్లోనే తమ లక్ష్యాన్ని చేరుకున్నట్లు అల్బానీ తెలుగు అసోసియేషన్(Albany Telugu Association) ప్రెసిడెంట్ తెలిపారు.ఈ కష్టకాలంలో తమవంతు సాయంగా అసోసియేషన్ సభ్యులు వెయ్యి డాలర్లు విరాళంగా అందించారు.ఈ మొత్తం డబ్బులతో కోవిడ్-19ను నివారించేందుకు KN95 మాస్కులను వినియోగించాలని వారు ఏకంగా 2500 మాస్కులను కొనుగోలు చేశారు.

పలు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, వైద్యులు మరియు వివిధ ఫౌండేషన్స్ సహాయంతో పీపీఈ కిట్లు, మాస్కులు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో గుర్తించి, వాటిని అందజేశారు.ఇలాంటి విపత్కర సమయంలో మాస్కులు దొరకడమే కష్టంగా ఉన్నప్పటికీ ఆటా సభ్యులు పెద్ద మొత్తంలో వాటిని కొనుగోలు చేసి పంపిణీ చేయడంలో విజయం సాధించారు.

Advertisement
వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్

తాజా వార్తలు