ఆ స‌మ‌యంలో ఏపీ ప్ర‌జ‌లు ఏసీలు వాడొద్దంటున్న ఆఫీస‌ర్లు..

క‌రెంట్ మ‌న నిత్య జీవితంలో ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇది లేనిదో ఇల్లు గ‌డ‌వదు.

ఇల్లే కాదు ఏ ఆఫీసు, ఏ కంపెనీ కూడా గ‌డ‌వ‌ని ప‌రిస్థితులు ఉంటున్నాయి.అందుకే క‌రెంట్‌కు అంత డిమాండ్ ఏర్ప‌డుతోంది.

అయితే క‌రెంట్ 24గంట‌లు స‌ర‌ఫ‌రా అవుతోంది క‌దా అని ప్ర‌తి చిన్న దానికి వాడేస్తున్నారు జ‌నాలు.దీంతో ఇంధ‌న కొర‌త కూడా ఏర్ప‌డుతోంది.

అయితే ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌లకు ఆఫీస‌ర్లు ఓ కొత్త కండీష‌న్ చెబుతున్నారు.ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్ప‌డుతున్న స‌మ‌యంలో వారు చేసిన హెచ్చ‌రిక అంద‌రినీ భ‌య‌పెడుతోంది.

Advertisement

అదేంటంటే ఏపీలోని ఇంధన శాఖ కార్యదర్శి అయిన నాగులపల్లి శ్రీకాంత్ కీలక చేసిన కామెంట్లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.ఏపీ ప్ర‌జ‌లు విద్యుత్ వినియోగంలో క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అప్పుడే క‌రెంట్ ఆదా అవుతుందంటూ హెచ్చ‌రించారు.

ఇందుకోసం పౌరులు ప్ర‌తి రోజు సాయంత్రం త‌మ ఇండ్ల‌లో గానీ లేదంటే ఆఫీసుల్లో గానీ ఆరు గంటల నుంచి మొద‌లు కుని ప్ర‌తి రోజు రాత్రి పదింటి వ‌ర‌కు ఏసీలు వాడొద్దని అప్పుడు క‌రెంట్ చాలా ఆదా అవుతుంద‌ని ఈ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ వ‌చ్చ‌ని ఆయ‌న పేర్కొంటున్నారు.

ప్ర‌స్తుతం ఏపీలో చాలా వ‌ర‌కు విద్యుత్‌కు డిమాండ్ ఏర్ప‌డుతోంద‌ని కాబ‌ట్టి ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ కూడా విద్యుత్ నిర్వ‌హ‌ణ‌లో జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఇందుకోసం సాయంత్రం నుంచి రాత్రి ప‌దింటి దాకా ఏసీల‌ను వాడొద్దంటూ చెప్పారు.ప్ర‌జ‌లంగ‌ద‌రూ ఇలా చేస్తే భ‌విష్య‌త్‌లో సర్దుబాటు ఛార్జీలు త‌గ్గుతాయ‌ని అది అంద‌రికీ చాలా అవ‌స‌ర‌మంటూ చెబుతున్నారు.ప్ర‌స్తుతం ఏపీలో క‌రెంట్ వినియోగం బాగా పెరిగిపోయింద‌ని ఇప్ట‌పికే రోజూ 195 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఏర్ప‌డుతోంద‌ని కాబ‌ట్టి దీనికి స‌రిప‌డా బొగ్గు లేక‌పోవ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంద‌న్నారు.

అందుకోస‌మే విద్యుత్ వాడ‌కాన్ని త‌గ్గించేందుకు ఏర్పాట్లు చేయాలంటూ కోరుతున్నారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు